DGP Shivdhar Reddy: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్యపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandrasekhar Reddy)ని స్వయంగా నిజామాబాద్ వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. వాహనాల చోరీలు, చెయిన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాద్‌ను నిజామాబాద్ సీసీఎస్(Nizamabad CCS)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమోద్ శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు.
అకస్మాత్తుగా కత్తితో దాడి..
రియాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, దారిలో అతను అకస్మాత్తుగా కత్తితో ప్రమోద్ ఛాతీలో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ దుర్మరణం చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్యపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, రియాద్‌ను పట్టుకునేందుకు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని నిజామాబాద్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని స్పష్టం చేశారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.
మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి అవసరమైన సహాయం చేయాలని కూడా డీజీపీ సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ సీపీ 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న రియాద్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.
Also Read: Afghan Cricketers Died: పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి
