DGP Shivadhar Reddy (imagedredit :twitter)
తెలంగాణ

DGP Shivadhar Reddy: డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టులో పిటిషన్!

DGP Shivadhar Reddy: తెలంగాణ డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ పోలీస్(డీజీపీ)గా శివధర్ రెడ్డి(DGP SHivadhar Reddy) ఇటీవలే బాధ్యతలు తీసుకున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన నియామకానికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. శివధర్ రెడ్డికి ఏప్రిల్ వరకే పదవీ కాలం ఉన్నందున సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారని ధనగోపాల్ రావు(Dhana Gopal reddy) అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు ఇకా నెంబరింగ్ ఇవ్వలేదు. ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తే ఏం జరుగుతుందో అని పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొన్నది.

ఇంటెలిజెన్స్ ఛీఫ్​‌గా..

సెప్టెంబర్ 30తో పదవీ కాలం ముగియడంతో జితేందర్ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టును దక్కించుకోవడానికి ఐపీఎస్​ అధికారులు కొందరు తీవ్రంగా పోటీ పడ్డారు. రేసులో అప్పటికి ఇంటెలిజెన్స్ ఛీఫ్​‌గా ఉన్న శివధర్​ రెడ్డి, హైదరాబాద్(Hyderabad)​ కమిషనర్‌గా పని చేస్తున్న సీవీ ఆనంద్(CV Anandh) అగ్రభాగంలో నిలిచారు. చివరకు 1994వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన శివధర్​ రెడ్డినే డీజీపీ పోస్ట్ వరించింది. ఈయనకు 2026 ఏప్రిల్​ వరకు సర్వీస్​ ఉన్నది. అయితే, ఆ తరువాత మరికొంత కాలంపాటు సర్వీస్‌ను పొడిగించే అవకాశం ఉందనే చర్చ ఉన్నది.

Also Read; TG High Court: స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ మెలిక పెట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సర్కార్!

శివధర్ రెడ్డి ప్రొఫైల్

సివిల్ సర్వీసెస్​ పరీక్షల్లో ఐపీఎస్ సాధించిన శివధర్ రెడ్డి కెరియర్ మొదట్లో అనకాపల్లి(Anakapally), నర్సీపట్నం, చింతపల్లి(Chinthapally)లో ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. గ్రేహౌండ్స్ విభాగంతోపాటు బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేశారు. ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం నల్లగొండ(Nalgonda), శ్రీకాకుళం(Srikakulam), నెల్లూరు(Nelluru), గుంటూరు(Gunturu) జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరే‌ట్‌లో ట్రాఫిక్​ డీసీపీ(DCp)గా పని చేశారు. దాంతోపాటు అత్యంత సున్నితమైనదిగా పరిగణించే దక్షిణ మండలం డీసీపీగా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా..

స్పెషల్ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్​‌లో ఎస్పీగా పని చేశారు. యునైటెడ్ నేషన్స్ మిషన్​‌లో భాగంగా కొసోవాలో కూడా విధులు నిర్వర్తించారు. డీఐజీగా ప్రమోషన్ పొందిన తరువాత ఎస్​ఐబీ ఛీఫ్‌గా, ఆ తరువాత ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా తనదైన శైలిలో పని చేసి ప్రశంసలు పొందారు. ఐజీగా ప్రమోట్ అయిన తరువాత ఏసీబీకి డైరెక్టర్ అయ్యారు. విశాఖ కమిషనర్‌గా కూడా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఇంటెలిజెన్స్ ఛీఫ్​‌గా నియమితులయ్యారు. అదనపు డీజీగా పదోన్నతి పొందిన తరువాత పర్సనల్​ విభాగం, రైల్వే, రోడ్డు సేఫ్టీ అథారిటీల్లో పని చేశారు. 2023లో తిరిగి ఇంటెలిజెన్స్​ ఛీఫ్‌గా నియమితులయ్యారు. 2024, ఆగస్టులో డీజీపీగా ప్రమోషన్​ వచ్చిన తరువాత అక్కడే కొనసాగుతూ వస్తున్నారు. 2014లో శివధర్​ రెడ్డి ఇంటెలిజెన్స్​ ఛీఫ్‌గా ఉన్నపుడే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగింది.

Also Read: Dark Chocolate teaser: ‘డార్క్ చాక్లెట్’ టీజర్ ఇదే.. ఏంటి గురూ మరీ ఇలా ఉంది..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!