Checkposts (imagecredit:twitter)
తెలంగాణ

Checkposts: రాష్ట్రంలో 15 చెక్ పోస్టుల తొలగింపునకు రంగం సిద్ధం?

Checkposts: రాష్ట్రంలోని సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చెక్ పోస్టులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై సస్పెన్స్ పెట్టింది. ఒక్కో చెక్ పోస్టులో సుమారు 8 నుంచి 12 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈచెక్ పోస్టుల్లో పనిచేస్తున్న ఎంవీఐ(MVI)లుకు ఇప్పటివరకు వాహనాలను ప్రభుత్వం కేటాయించలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్ పోర్స్ మెంట్ టీంలుగా చేసి వాహన తనిఖీ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొంటుంది. అయితే అందులో శిక్షణ మాత్రం ఇవ్వలేదు. ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

చెక్ పోస్టుల తొలగింపుతో

తెలంగాణ రాష్ట్ర సరిహదుల్లో మొత్తం 15 రవాణా శాఖ చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులను ఎత్తివేసి ఇకపై వాహన్ పోర్టల్ ద్వారా, అడ్వాన్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు అధికారులు, సిబ్బంది వాహనాలు తనిఖీ చేసి పర్మిట్ లేకపోతే అందుకు సంబంధించిన ఫీజు తీసుకొని ఇస్తున్నారు. అలాకాకుండా ఇక ఆన్ లైన్(Online) లోనే ఇతర రాష్ట్రానికి చెందిన వాహనదారులు టీపీ(తెలంగాణ పర్మిట్) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్కో చెక్ పోస్టులో సుమారు 8 నుంచి 12 మంది వరకు ఎంవీఐలు, కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం చెక్ పోస్టుల తొలగింపుతో ఈ సిబ్బందిని ఏ కార్యాలయంలో అలాట్ మెంట్ చేస్తారనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. ఆ సిబ్బంది, అధికారులతో ఏ పనిచేయిస్తారనేది మార్గదర్శకాలు సైతం వెలువడలేదు. దాదాపు కేబినెట్ నిర్ణయం తీసుకొని నెలరోజులు గడుస్తున్నా దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

ఎన్ ఫోర్స్ మెంట్ టీం

చెక్ పోస్టులో పనిచేసే సిబ్బందితో ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో చెక్ పోస్టులో ఇద్దరు నుంచి 4 వరకు ఎంవీఐలు పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం వాహనాలు కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ టీం(Enforcement Team)లు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ప్రతి ఎంవీఐకి ప్రభుత్వం వాహనం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు వాహనానికి డ్రైవర్, కానిస్టేబుళ్లను, హోంగార్డులను సైతం కేటాయించాల్సి ఉంటుంది. దీంతో వాహనాలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రవాణాశాఖలో అంత సిబ్బంది లేరని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. వాహనం కేటాయించకుండా తనిఖీని ఎంవీఐలు ఎలా చేస్తారనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: Diabetes Control: షుగ‌ర్ ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా? అయితే, రోజూ ఈ ఆకుల‌ను తినండి..!

ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా?

వీటన్నింటికి తోడు ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు ఏం చేయాలి? తనిఖీలు ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి అనే దానిపై శిక్షణ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులపాటు ఇస్తారనేది కూడా ఉద్యోగుల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో ఏయే నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఎంత జరిమానా విధించాలి అనే వివరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా? అనేది కూడా చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టీజీపీఎస్సీ ద్వారా 97 మంది ఎంపికై శిక్షణ తీసుకుంటున్నారు. వారందరికి సెప్టెంబర్ 10 శిక్షణ పూర్తి అవుతుంది. వారంతా ఏఎంవీఐలుగా విధుల్లో చేరబోతున్నారు. వారికి ఏ బాధ్యతలు అప్పగిస్తారు.. వారికి ఎంతమందిని సిబ్బందిని తొలగిస్తారు. వారిని సైతం ఎన్ ఫోర్స్ బృందంలో చేర్చుతారా? లేకుంటే ఆర్టీఏ కార్యాలయాల్లో బాధ్యతలు అప్పగిస్తారా? అనేది కూడా చర్చజరుగుతుంది. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొబైల్ చెకింగ్ టీం

మరోపక్క వాహన్ పోర్టల్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కాలేదని ఆర్టీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు చెక్ పోస్టులు ఎత్తివేస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఎలా పర్మిట్ తీసుకుంటాయనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. గుజరాత్ ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసి మొబైల్ చెకింగ్ టీంలను ఏర్పాటు చేసింది. ఆ టీంలతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని మార్గదర్శకంగా తీసుకొని మొబైల్ చెకింగ్ టీంలను ఏర్పాటు చేసి రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరుల లీకేజీనిఅరికట్టేందుకు చర్యలు తీసుకుంటారా? ఏలా ముందుకు వెళ్తారనేది చర్చజోరుగా సాగుతుంది. ప్రభుత్వం చెక్ పోస్టులపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Also Read: OG Movie Update: ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు