TG Cabinet Expansion: ఈనెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పిసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వివిధ సమీకరణాల వల్లే మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరిగిందని, రాష్ట్రంలో మంత్రులు అందరు కలిసే ఉన్నారని, కావాలనే కొందరు మాపై తప్పుడు ప్రచారం చెస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే మా ముందున్న లక్ష్యం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కావాలనే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వక్రీకరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసుపెడతామని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల పై మధ్య ప్రదేశ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో సీఎంని మార్చుతారని అనడం ప్రతి పక్షాలు చేస్తు్న్న తప్పుడు ప్రచారం మాత్రమే అని తెలిపారు.
Also Read: Maheshwar Reddy on Congress: మంత్రివర్గ విస్తరణకు అడ్డుగా సీఎం.. అందుకే విభేదాలు!
రాప్ట్రంలో బి.అర్.ఎస్, బిజేపి పని అయిపోయిందని, కాంగ్రెస్ పై మాట్లాడే హక్కు వాల్లకు లేదని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట నడుస్తుందని ఎద్దేవ వేశారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణం, మహిళలకు కాంగ్రెస్ లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.