Telangana Budget 2025 Live: తెలంగాణ బడ్టెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2025-26 ఏడాదికి గాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్టెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. ఒక పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్టెట్ ను ప్రవేశపెడుతుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం గతేడాది ఫిబ్రవరిలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో 3 నెలల కాలానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్టెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మిగిలిన 9 నెలల కోసం 2024 జులైలో రూ.2.90 లక్షల కోట్లతో రెండోసారి బడ్టెట్ తీసుకొచ్చారు.
బడ్జెట్ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
ప్రధాన పథకాలకు కేటాయింపులు
రైతు భరోసా – రూ.18,000 కోట్లు
చేయూత – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి-ఆర్టీసీ – రూ. 4,305 కోట్లు
గృహ జ్యోతి – రూ.2,080 కోట్లు
వరి బోనస్ – రూ.1,800 కోట్లు
ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
వంటగ్యాస్ – రూ.723 కోట్లు
ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
విద్యుత్ సబ్సిడీ – రూ.11,500 కోట్లు
యువవికాసం- రూ. 6,000 కోట్లు
స్కాలర్‌షిప్‌లు – రూ.4,452 కోట్లు
కల్యాణలక్ష్మి – రూ. 3,683 కోట్లు
నియోజకవర్గాలకు 3,300 కోట్లు
రేషను బియ్యం – రూ.3,000 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ – రూ.2,900 కోట్లు
డైట్ ఛార్జీలు – రూ. 2,659 కోట్లు
పారిశ్రామిక ఇన్సెంటివ్స్ – రూ.1,730 కోట్లు
రైతు బీమా – రూ.1,589 కోట్లు
వడ్డీలేని రుణాలు – రూ. 1,511 కోట్లు
సోలార్ పవర్ – రూ.1,500 కోట్లు
గ్రీన్ ఎనర్జీ – రూ.1,000 కోట్లు
నగరాభివృద్ధి – రూ.1,000 కోట్లు
టూరిజం – రూ.721 కోట్లు
జలవికాసం – రూ.600 కోట్లు
వర్శిటీల ఇన్‌ఫ్రా – రూ.500 కోట్లు
రోడ్ల అప్‌గ్రేడేషన్ – రూ.500 కోట్లు
ఫ్యూచర్ సిటీ – రూ.100 కోట్లు
మొత్తం – రూ.1,04,329 కోట్లు
రాష్ట్ర తలసరి ఆదాయం (రూ.లలో)
2014-15 – రూ.1,24,104
2015-16 – రూ.1,40,840
2016-17 – రూ.1,59,395
2017-18 – రూ.1,79,358
2018-19 – రూ.2,09,848
2019-20 – రూ.2,31,378
2020-21 – రూ.2,31,103
2021-22 – రూ.2,765,443
2022-23 – రూ.3,17,115
2023-24 – రూ.3,47,299
2024-25 – రూ.3,79,751
రాష్ట్రం మీద రుణభారం
2014-15 – రూ.83,845 కోట్లు
2015-16 – రూ.93,115 కోట్లు
2016-17 – రూ.1,29,531 కోట్లు
2017-18 – రూ.1,52,190 కోట్లు
2018-19 – రూ.1,75,281 కోట్లు
2019-20 – రూ.2,05,858 కోట్లు
2020-21 – రూ.2,44,019 కోట్లు
2021-22 – రూ.3,21,612 కోట్లు
2022-23 – రూ.3,56,486 కోట్లు
2023-24 – రూ.4,01,844 కోట్లు
2024-25 – రూ.4,50,918 కోట్లు
2025-26 – రూ.5,04,814 కోట్లు(అంచనా)
2025-26 బడ్జెట్ సమగ్ర స్వరూపం
రెవెన్యూ వసూళ్ళు – రూ.2,29,720 కోట్లు
మూలధన వసూళ్ళు – రూ.69,639 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
మూల ధన వ్యయం – రూ.36,504 కోట్లు
రుణాలు, అడ్వాన్సులు : 21,350.00
రుణాల చెల్లింపు – రూ.20,127.00
రెవెన్యూ మిగులు – రూ.2,738 కోట్లు
ద్రవ్య లోటు – రూ.54,009 కోట్లు
పన్నుల రాబడి
వ్యాట్, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా – రూ.88,463 కోట్లు
స్టేట్ ఎక్సైజ్ – రూ.27,623 కోట్లు
ఇతర పన్నులు – రూ.29,321 కోట్లు
నాన్-టాక్స్ రెవెన్యూ : 31,618.77
కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.29,899 కోట్లు
మొత్తం – రూ.2,29,720 కోట్లు
ఖర్చయ్యేది ఇలా
రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం – రూ.36,504.45
అప్పులు, వడ్డీల చెల్లింపు – రూ.21,350 కోట్లు
ప్రజారుణం చెల్లింపు – రూ.15,848 కోట్లు
ఇతర రుణాల పేమెంట్ – రూ.3,738 కోట్లు
కేంద్ర రుణాల చెల్లింపు – రూ.440 కోట్లు
మొత్తం ఖర్చు – రూ.3,04,865 కోట్లు
చేబదులుతో కలిపి ఖర్చు – రూ.3,04,965 కోట్లు
రాష్ట్రానికి ఆదాయ రాబడి
కేంద్రం నుంచి పన్నుల వాటా – రూ.29,899 కోట్లు
రాష్ట్ర స్వీయ పన్నుల ద్వారా – రూ.1,45,419 కోట్లు
నాన్-టాక్స్ రెవెన్యూ – రూ.31,618 కోట్లు
కేంద్ర గ్రాంట్లు – రూ.22,782 కోట్లు
రిజర్వు బ్యాంకు నుంచి అప్పులుగా – రూ.64,539 కోట్లు
కేంద్రం నుంచి రుణాలుగా – రూ.4,000 కోట్లు
ఇతర రుణాలు – రూ.1,000 కోట్లు
డిపాజిట్ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.4,000 కోట్లు
రుణాలు, అడ్వాన్సుల ద్వారా – రూ.1,106 కోట్లు
మొత్తం ఆదాయం – రూ.3,04,366.55
ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్నది – రూ.672 కోట్లు
శాఖల వారీగా కేటాయింపులు
పశుసంవర్థక శాఖ -రూ.1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ. 5,734 కోట్లు
విద్యాశాఖ – రూ.23,108 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమం – రూ.40,232 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ – రూ.11,405 కోట్లు
చేనేత రంగానికి – రూ.371 కోట్లు
మైనార్టీల సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమల శాఖ – రూ.3,527 కోట్లు
ఐటీ శాఖ – రూ.774 కోట్లు
ఉచిత విద్యుత్ – రూ.3,000 కోట్లు
విద్యుత్ శాఖ – రూ.21,221 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖక – రూ.12,393 కోట్లు
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ – రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రోడ్లు-భవనాల శాఖ – రూ.5,907 కోట్లు
క్రీడల శాఖ – రూ.465 కోట్లు
అడవులు, పర్యావరణ శాఖ – రూ.1,023 కోట్లు
దేవాదాయ శాఖక – రూ.190 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు
ఆ ప్రాంతాలకు మహర్దశ!
నూతన టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రీజనల్ రింగ్ రోడ్ (RRR) సమీపంలో మౌలిక వసతులు అభివృద్ధి, గోదావరి-కృష్ణా నదులపై జెట్టీలు, లాంచి స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. అలాగే నదీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు నల్లమలలో పర్యాటక ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 242 కోట్లతో పనులు చేపట్టింది. కాగా, బడ్జెట్ లో పర్యాటక శాఖ అభివృద్ధికి రూ.775 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
టూరిజం పాలసీ ప్రారంభం
రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నూతన టూరిజం పాలసీ (New tourism policy)ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్ర GSDPలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించింది. టూరిజంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉచిత బస్సు ప్రయాణంపై
మహాలక్షీ పేరుతో తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంపై బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇప్పటి వరకు 7227 బస్సుల్లో 149 కోట్ల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళలకు రూ. 5005.95 కోట్ల టికెట్ ఖర్చులు ఆదా అయినట్లు చెప్పారు. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 69 శాతం గా ఉన్న ఆర్టీసీ అక్యూపెన్సి రేషియో.. ప్రస్తుతం 90 శాతానికి పెరిగినట్లు చెప్పారు. ఫలితంగా బస్సులను 100 శాతం అక్యుపెన్సి రేషియోతో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకూ 6400 మంది ఉద్యోగులను అదనంగా నియమించినట్లు భట్టి వివరించారు. మహాలక్ష్మీ పథకానికి సంబంధించి ఆర్టీసీ క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తున్నట్లు ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.
రంగాల వారీగా కేటాయింపులు
రైతు భరోసా కోసం – రూ.18,000 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
పశు సంవర్డక శాఖ – రూ.1,674 కోట్లు
సివిల్ సప్లై – రూ.5,734 కోట్లు
విద్యా శాఖ – రూ.23,108 కోట్లు
కార్మిక ఉపాధి కల్పన – రూ. 900 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ – రూ.2,862 కోట్లు
భట్టి బడ్జెట్ ప్రసంగం
తెలంగాణ బడ్టెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Budjet Speech) ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారన్న భట్టి.. వారు ఇచ్చిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాలకు తాకట్టు పెట్టమని స్పష్టం చేశారు.
2025-26 బడ్జెట్ అంచనాలు
తెలంగాణ బడ్టెట్ 2025-26 ను రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిచినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభకు తెలియజేశారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే మూలధన వ్యయం రూ.36,504 కోట్లు గా అంచనా వేసినట్లు సభ్యులకు వివరించారు.
స్పీకర్ కు అందజేత
2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు అసెంబ్లీలో అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.