Heavy Rains: ఈ ఏడాది వాన వస్తుందంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే, గత నెల నుంచి వానలు ఒక రోజు కాకపోయిన మరొక రోజు పడుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా తమ పనులు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.అయితే, ఇప్పుడు మరికాసేపట్లో నగరంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
పశ్చిమ, మధ్య తెలంగాణకు ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిర్సిల్లలో రాబోయే 3 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి, జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో పటాన్‌చెరువు, ఇస్నాపూర్, అమీన్‌పూర్, బాచుపల్లి వైపు వంటి శివార్లలో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. నగరంలో మిగిలిన ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పొడిగా ఉంటుందని చెప్పారు. ఇక నేడు, దక్షిణ, మధ్య, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర టీజీ నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో మధ్యాహ్నం వరకు తుపానులు పడుతున్నాయి.
తెలంగాణలోని దక్షిణ, తూర్పు, సెంట్రల్ టీజీ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వైపు మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయంలో తుపాను పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి మొదలయ్యి రాత్రిపూట ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.