TG Agriculture (imagecredit:twitter)
తెలంగాణ

TG Agriculture: దేశ చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డు.. ఈ ఘనత తెలంగాణ రైతులదే..!

TG Agriculture: తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 67.57 లక్షల ఎకరాలలో వరి(Pady) సాగు జరిగిందని, ఇది భారతదేశ చరిత్రలోనే అరుదైన రికార్డ్ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kuar Redy) స్పష్టం చేశారు. హైదరాబాద్(Hyderabad), ఎర్రమంజల్‌లోని సివిల్ సప్లయ్స్ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో మొత్తం 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా వేశారు. సన్నాలు 40.75 లక్షల ఎకరాలలో సాగు, 90.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి, దొడ్డు రకం 26.82 లక్షల ఎకరాలలో సాగు, 57.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

నీటిపారుదల శాఖ విజయం

మొత్తం దిగుబడిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిపారు. తెలంగాణ(Telangana) నీటిపారుదల శాఖ సాధించిన విజయంతో పాటు, ఈ రికార్డు ఘనత రాష్ట్ర రైతాంగానికే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అత్యల్ప కాలంలో రెట్టింపు ధాన్యం దిగుబడి సాధించిందంటే అది రైతులపై ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం అని పేర్కొన్నారు.

Also Read; Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు

సన్నాలకు బోనస్ కొనసాగింపు..

సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 బోనస్‌ను కొనసాగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు గాను రూ. 21,112 కోట్లు అవుతుందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం(Rainy season), యాసంగి పంటలకు కలిపి సన్నాలకు అందించే బోనస్ మొత్తం రూ. 3,158 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ. 6,500 కోట్లను సత్వరం విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌(International market)లో తెలంగాణ(Telangana) సన్నాలకు భారీ డిమాండ్ ఉందని, ఇప్పటికే ఫిలిప్పీన్స్(Philippines) తదితర దేశాలకు సన్నాల ఎగుమతి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్‌సీఐ(SCI)తో సమన్వయం చేసుకోవాలని, రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్‌సీఐ గిడ్డంగులలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు.

Also Read: Kantara Chapter 1: ఆ రికార్డుకు చేరువలో ‘కాంతార చాప్టర్ 1’.. కన్నడలో మరో వెయ్యి కోట్ల సినిమా!..

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు