Special Clinics(image credit:X)
తెలంగాణ

Special Clinics: వృద్ధులకు గుడ్‌న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్లినిక్‌లు!

Special Clinics: రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు ప్రత్యేక క్లినిక్ లు రాబోతున్నాయి. త్వరలో అన్ని జిల్లాల్లో జీరియాట్రిక్ క్లినిక్ లను (వృద్ధులకు ప్రత్యేకంగా) ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రులలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ విభాగంలో ఓపీ, ఐపీ వంటి సేవలు అందించనున్నారు. ఇన్ పేషెంట్ల కోసం ఒక్కో క్లినిక్ లో 30 ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయనున్నారు.

ఓపీ విభాగానికి సులువుగా చేరేందుకు ఎంట్రన్స్ వద్ద ప్రత్యేకంగా ర్యాంప్ , వీల్ చైర్లను ఏర్పాటు చేయనున్నారు. మెడికల్ కాలేజీల్లోని ఇతర విభాగాల కంటే కొత్తగా ఈ జీరియాట్రిక్ క్లినిక్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లినిక్ లలో ఆర్ధో, సైకలాజికల్ , ఈఎన్ టీ, జనరల్ ట్రీట్ మెంట్లకు స్పెషల్ కేర్ తీసుకోనున్నారు. 65 ఏళ్లు పై బడిన వాళ్లందరికీ ఈ క్లినిక్ లలో చికిత్సను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు డీఎంఈ నరేంద్ర కుమార్ అన్ని జిల్లాల ప్రిన్సిపాల్స్ కు ఆదేశాలిచ్చారు. డీఎంఈ కార్యాలయంలోని డాక్టర్ల ప్రత్యేక టీమ్ జీరియాట్రిక్ క్లినిక్ ల ఏర్పాటును మానిటరింగ్ చేయనున్నది. ఈ క్లినిక్ ల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రత్యేకంగా లో న్ రూపంలో నిధులు ఇవ్వనున్నది.

నోడల్ కేంద్రంగా నిమ్స్?

జీరియాట్రిక్ క్లినిక్ లకు నిమ్స్ నోడల్ కేంద్రంగా పనిచేయనున్నది. మెడికల్ కాలేజీల్లోని క్లినిక్ లకు వచ్చిన క్రిటికల్ కండీషన్ పేషెంట్లను రిఫరల్ విధానం ద్వారా నిమ్స్ కు షిఫ్ట్ చేయనున్నారు. పేషెంట్ల కండీషన్ బట్టి మాత్రమే నిమ్స్ లో అడ్మిషన్ కల్పిస్తారు. మరి కొన్ని కేసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా టీచింగ్ ఆసుపత్రుల క్లినిక్ లకు సలహాలు, సూచనలు ఇవ్వనన్నారు.

Also read: Simhachalam Tragedy: సింహాచలం విషాదం.. సాఫ్ట్ వేర్ దంపతులు సహా ఫ్యామిలీలో నలుగురు మృతి

ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ల ప్రోఫెసర్ల బృదం పనిచేయనున్నది. చిన్న పిల్లలకు పీడియాట్రిక్ విభాగం తరహాలోనే, వృద్ధులకు జీరియాట్రిక్ విభాగంగా వైద్య సేవలకు రూపకల్పన చేయనున్నారు.
దీంతో పాటు అంబులెన్స్ లను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు.

క్యాంపుల ద్వారా క్లినిక్‌లకు

ఇక క్షేత్రస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు,పల్లె దవాఖాన్ల లోని స్టాఫ్​, ఆశాలు, ఏఎన్ ఎంల ఆధ్వర్యంలో గ్రామాల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. ఇందులో వృద్ధులను గుర్తించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తారు. సాధారణ రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలోని జీరియాట్రిక్ క్లినిక్ లకు పంపిస్తారు. ఒక సారి జీరియాట్రిక్ క్లినిక్ లో పేషెంట్ వివరాలు నమోదైతే, రెగ్యులర్ గా మానిటరింగ్ కూడా నిర్వహించనున్నారు.

ప్రతి నెల హెల్త్ కండీషన్ పై క్షేత్రస్థాయి హెల్త్ స్టాఫ్​ ఆయా క్లినిక్ లకు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి వలన వృద్ధుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం చాలా మంది పిల్లలు తమ పేరెంట్స్ పట్టించుకోకపోవడం, వృద్ధులు నిర్లక్ష్యం చేయడం వంటి వాటితో అనారోగ్యానికి గురవుతున్నారు. స్పష్టమైన వైద్యసలహాలు అందకపోవడంతో నష్టపోవాల్సి వస్తున్నది. ఈ క్లినిక్ లు అందుబాటులోకి వస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు.

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?