SLBC Tunnel Update: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) తవ్వకం సందర్భంగా గల్లంతైన ఎనిమిది మందిలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే రికవరీ చేయగలిగిన రెస్క్యూ టీమ్‌లు మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలను కంటిన్యూ చేస్తున్నాయి. ఆ ఆరుగురి జాడ కనిపెట్టే లక్ష్యంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, వీలైనంత తొందరగా ముగించాలని భావించిన రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పన్నెండు మందితో ప్రత్యేక కమిటీని నియమించింది.
ప్రమాదం జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నందున ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భావించింది. టన్నెల్‌లో సిమెంట్ కాంక్రీట్ పైకప్పు కూలి ప్రమాదం జరగడంతో దాదాపు వెయ్యి టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ యంత్రం సైతం ధ్వంసమైందని, బండరాళ్లతో పాటు మట్టి, నీరు కలిసి బురదతో దాదాపు 200 మీటర్ల ప్రాంతం మనుషులు వెళ్లలేని తీరులో మారిందని విపత్తు నిర్వహణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read: Nalgonda Murder Case: డిటెక్టివ్ స్టైల్ హత్య.. మామ-కూతురి ప్లాన్‌కు పోలీసులు చెక్!
ల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్-సీఎస్ఐఆర్ డైరెక్టర్, జీఎస్ఐ ట్రెయినింగ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ డైరెక్టర్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన టన్నెల్ నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, తెలంగాణ అటవీ శాఖ పీసీసీఎఫ్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, ఎస్డీఆర్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ (సీడీఓ), నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎస్ఎల్‌బీసీ చీఫ్ ఇంజినీర్.. వీరంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు పరస్పరం సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేసి ఆరుగురి ఆచూకీని కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్లను ముగించేలా యాక్షన్ ప్లాన్‌ను విపత్తు నిర్వహణ విభాగం రూపొందించింది.