Junior Mining Engineers: రీ ఎంట్రీ అయిన జేఎంఈటీ ట్రైనీలు!
Junior Mining Engineers (imagecredit:swetcha0
Telangana News

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

Junior Mining Engineers: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా(JMET) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్(CMD Balaram Nayak) ఆదేశాల మేరకు వారికి మరో అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు రిలీజ్ చేశారు. గతంలో వీరంతా విధులకు గైర్హాజరవ్వడం, అవసరమైన ధృవపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించారు.

ఆ కమిటీ సూచన మేరకు

అయితే వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)కి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. టర్మినేట్ అయి పున:నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలు సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ వద్దకు వెళ్లి తమ వివరాలు, ఓవర్ మెన్ సర్టిఫికెట్(Overman Certificate), గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు(Gas Testing First Aid Certificate) మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆ కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీచేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరిన జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలు తమ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా కనీసం 190 మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుందని సీఎండీ స్పష్టంచేశారు.

Also Read; GHMC Revenue: ప్లానింగ్ తో పెరిగిన ఆదాయం.. గతేడాదితో పోల్చితే 90 శాతం అధికం

హైపర్ కమిటీలో దరఖాస్తు

ఇదిలా ఉండగా టర్మినేట్ అయిన జేఎంఈటీలకు మరో అవకాశం రావడం అదృష్టమని, కష్టపడి పనిచేయాలని సీఎండీ ఆదేశించారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూలై 24 2025 నాటికి టర్మినేట్ అయిన జేఎంఈటీల వయసు 45 సంవత్సరాల కంటే తక్కువ ఉండి, హైపర్ కమిటీలో దరఖాస్తు చేసుకుని మెడికల్ టెస్టుల్లో ఫిట్ అయినవారికి జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ, టీ అండ్ ఎస్ గ్రేడ్-సీగా పున:నియామక పత్రాలను త్వరలో అందజేస్తామని సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. పోటీ మార్కెట్ లో ఉద్యోగాలను సాధించడం అతి కష్టంగా ఉందని, అలాంటి సమయంలో ఒకసారి తొలగింపునకు గురైనప్పటికీ మరో విలువైన అవకాశం ఇస్తున్న కంపెనీకి ఉత్తమ సేవలు అందించాలని కోరారు.

Also Read: Tollywood directors: టాలీవుడ్‌ టాప్ దర్శకులు ఎవరి దగ్గర పనిచేశారో తెలుసా?..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?