Senior Journalists: సీఎం సీపీఆర్వో పోస్టు కోసం సీనియర్ జర్నలిస్టులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీఎం రేవంత్ కు దగ్గరగా ఉన్నోళ్లలో కొందరు ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేయడం గమనార్హం.
అయితే సీఎం మదిలో ఎవరున్నారనేది? ఇప్పుడు బిగ్ డిస్కషన్ గా మారింది. ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం జర్నలిస్టు పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. హైదరాబాద్ లో వర్క్ చేసే ఒక బీసీ జర్నలిస్టు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
దీంతో పాటు మరి కొంత మంది ప్రొఫైల్స్ ను నేరుగా సీఎం పరిశీలిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మీడియాలో తగిన గుర్తింపు, ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటెన్ చేయడంతో పాటు పారదర్శకంగా వ్యవహరించే వాళ్ల ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నది. అయోధ్యరెడ్డి ప్లేస్ లో ఎవరు చేరబోతున్నారని? ఇప్పుడు పొలిటికల్ తో పాటు మీడియా సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది.
Also read: GHMC: ఆదేశాలు బేఖాతర్.. బల్దియాలో కార్మిక చట్టాల ఉల్లంఘన..
ఇట్లే కొనసాగిస్తే..?
సీపీఆర్వో పోస్టు భర్తీ చేయకుండా ఇప్పుడున్న వ్యవస్థతోనే పబ్లిక్ రిలేషన్ ను కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అని సీఎం అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సీఎం పీఆర్ వోలుగా ఉన్నోళ్లంతా ఫర్ ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారనే అభిప్రాయం సీఎంలో ఉన్నది.
సబ్జెక్ట్ లు వారీగా అవగాహన కలిగిన జర్నలిస్టులు కావడంతో వ్యవస్థను సక్రమంగా నెట్టుకొస్తున్నారు. మీడియా కో ఆర్డినేషన్, సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు మినిట్స్ తయారు చేయడం వంటివి స్పీడ్ గా ఉన్నట్లు సీఎం భావిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు కొత్తోళ్లను తీసుకోవాల్సిన అవసరం లేదనే అంశాన్నీ సీఎం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట. ఈ వీక్ లోనే సీపీఆర్ వోపై భర్తీపై క్లారిటీ రానున్నది.
సీఎందే ఫైనల్ డెసిషన్…
ఇంత కాలం సీపీఆర్వోగా పనిచేసిన అయోధ్యరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడంతో పాత పోస్టు లో వెకెన్సీ ఏర్పడింది. అయితే దీన్ని భర్తీ చేయాలా? వద్దా? అనేది సీఎం దే ఫైనల్ డెసిషన్. ఇప్పటి వరకు సీపీఆర్వోగా వర్క్ చేసిన అయోధ్య రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కోర్ టీమ్ లో ఒకరుగా గుర్తింపు ఉన్నది.
Also read: Tamannaah Bhatia: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఫోటోలు వైరల్.. ఇది నిజమేనా?
ఆయన సీపీఆర్వోగా పనిచేస్తున్నా.. రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేస్తూ వచ్చారు. పార్టీ, ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన మానిటరింగ్ చేస్తూ తనకు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశారు. అయితే సడన్ గా ఆయనకు ఆర్టీఐ కమిషనర్ గా ప్రకటించడంతో అందరి మెదళ్లలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.