Slbc Accident
తెలంగాణ

Slbc Accident : ఎస్ ఎల్ బీసీ సొరంగంలో 12 కి.మీ వరకే వెళ్లొచ్చు.. ఆ తర్వాత కష్టమే..!

Slbc Accident : శ్రీశైలం ఎస్ ఎల్ బీసీ సొరంగ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం (sri shailam) ఎడమగట్టు కాలువ సొరంగం పై కప్పు కూలడంతో ఎనిమిది కార్మికులు అందులో చిక్కుకుని పోయిన సంగతి తెలిసిందే. వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ ఎఫ్​ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ టన్నెల్ లో కార్మికులు చిక్కుకున్న దాకా వెళ్లడానికి సహాయక టీమ్స్ కు వీలు కావట్లేదు.

ఈ సొరంగ మార్గం ద్వారా 12 కి.మీ మేరకు వ్యాగన్లలో వెళ్లడానికి వీలుంటుంది. ఆ తర్వాత వ్యాగన్లు వెళ్లడం కష్టం అని చెబుతున్నారు. అక్కడి నుంచి అవసరం అయితే డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారంట. డీవాటరింగ్ కోసం టన్నెల్ లోపల ఐదు దశల్లో జనరేటర్లే ఏర్పాటు చేశారు కాబట్టి.. వాటి ద్వారా ట్యూబ్ లైట్లు కూడా ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్మీలో అనుభవజ్ఞులైన వారిని ఈ ఆపరేషన్ కోసం రప్పిస్తున్నారు. వారితో పాటు భారీ జేసీబీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!