Ramchender Rao (imagecredit:twitter)
తెలంగాణ

Ramchender Rao: రాంచందర్ రావుకు కేంద్ర మంత్రుల ఫోన్.. పరిస్థితిపై ఆరా..?

Ramchender Rao: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితులపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), జేపీ నడ్డా)JP Nadda) ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao)కు వారు ఫోన్ చేసి వరద పరిస్థితులను తెలుసుకుని భరోసా ఇచ్చారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలకు వీలుగా అవసరమైన మేరకు సిబ్బందిని, సామగ్రిని కేంద్రం నుంచి వెంటనే పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు. కాగా అనంతరం రాంచందర్ రావు బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, ఆపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చేరుకోలేని పరిస్థితుల్లో

భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. బూత్ ల వారీగా సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. వరద ప్రాంతాలకు సిబ్బంది చేరుకోలేని పరిస్థితుల్లో.. లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారం, తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.

ప్రత్యేకంగా బీజేవైఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, అవసరమైన సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిబద్ధతతో ఉండాలని రాంచందర్ రావు గారు పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వరద పరిస్థితులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Also Read: Collector Harichandana: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ హరిచందన దాసరి

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?