raja singh
తెలంగాణ

Raja Singh: శ్రీశైలంలో ముస్లింలకు షాపులెందుకు? రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh: సౌత్ ఇండియన్ లీడర్స్ లో రాజాసింగ్ లాంటి కరుడుగట్టిన హిందుత్వ వాది మరోకరు ఉండరనేది నిర్వివాదాంశం. ఆయనతో పోల్చితే బండి సంజయ్ కొంత లౌక్యం ఉందనే చెప్పాలి. కానీ రాజాసింగ్ వ్యవహారం అలా ఉండదు.  తల తె గి పడినా సరే… తాను చేయదలిచిన వ్యాఖ్యలే చేస్తాడు. అది మతం విషయంలోనే కాదు… సొంత పార్టీలో నాయకులను సైతం ఆయన బేఖాతరు చేయని సందర్బాలు ఎన్నో ఉన్నాయి.  దాంతో సస్పెన్ష్షన్ కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది.  అయినా రాజాసింగ్… జంకడు, బొంకడు. తన ముక్కుసూటి తనాన్ని, కుండ బద్దలు కొట్టే తత్వాన్ని వదలడు. తనదైన యూనిక్  స్టైల్ ను వీడాడు. అయినా సరే… పార్టీ ఆయనను కోరుుకుంటుంది. అవసరమైనప్పడు సస్పెండ్ ఎత్తివేసి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది. మరదీ… రాజాసింగ్ అంటే! ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై సొంత పార్టీ తీరుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన వార్తలో నిలిచారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిని ఎంపికపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అక్కడ బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవీ ఇవ్వాలని సూచించినప్పటికీ ఎంఐఎం పార్టీ నేతలకు  సన్నిహితుడైన వ్యక్తికి పదవిని కట్టబెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అసంతృప్తిని తెలియపరుస్తూ… ఏకంగా ఓ వాయిస్ మెసెజ్ ను విడుదల చేశారు. పార్టీ నన్ను పక్కనపెడుతోందని, అలాంటప్పుడు పార్టీకి నేనెంటో చూపిస్తానని అందులో చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యల్ని బండి సంజయ్ తప్పుబట్టారు.  తాజాగా రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకు షాపులు ఎందుకు కేటాయించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. శ్రీశైలంలో శివ భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో సైతం  ముస్లింలకు  ఆలయ ప్రాంగణంలో అనేక షాప్ లు కేటాయించారని, అప్పుడు హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయని రాజాసింగ్ గుర్తుచేశారు. ఇటీవల కొందరు శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాపులు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ దేవాలయాల వద్ద ఇతర మతస్తుల షాపులు ఉండకుండా చూడాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కోర్టు లు కూడా అదే చెబుతున్నాయన్నారు. అక్కడ ఓ ఫాల్తు లీడర్, ఆలయ ఈవో ముస్లింలకు అండగా ఉంటున్నారని రాజాసింగ్ విమర్శలు చేశారు. పోలీసులు శివ స్వాములపై లాఠీచార్జీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మరోసారి శివ స్వాములపై లాఠీచార్జీ చేసినా, వారిని ఇబ్బంది పెట్టినా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శివ భక్తులమంతా శ్రీశైలం చేరుకుంటామని ఆలయ ఈవో, పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్న వారిని ఎలా పంపాలో తాము చూసుకుంటామన్నారు.

రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్
తనకు రెండు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ‘ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షా అల్లా. అప్పుడు మీ యోగి, మీ మోడీ కూడా మిమ్మల్ని రక్షించలేరు’ అని హెచ్చరించారని ఆయన తెలిపారు. తనకు +918986512926, తో పాటు +919434154614 నంబర్ల నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?