Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సడెన్ గా తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. కొద్ది సేపట్లో వరంగల్ కు వెళ్లబోతున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కులగణన అంశం మీదనే చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనేది చర్చించబోతున్నారు. అటు నుంచి చెన్నైకి బయలుదేరుతారని సమాచారం. ట్రైన్ లో ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న విద్యార్థులతో ముఖాముఖి ఉంటుందని తెలుస్తోంది.
