Pranay case: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య(Pranay Murder) కేసులో కొద్దిసేపటి క్రితం నల్లగొండ కోర్టు(Nalgonda court) తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక నిందితుడు(A2) సుభాశ్ శర్మకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా మరో ఆరుగురికి యావజ్జీవ శిక్షను వేసింది. అయితే ఇందులో ఏ6 గా ఉన్నది మారుతిరావు సోదరుడు శ్రవణ్(Accused Sravan). అతనికి కోర్టు జీవిత ఖైదు(Life Sentence) వేసింది. అయితే. .. తన తండ్రి ఏ తప్పు చేయలేదని , ఆయనను అనవసరంగా ఇరికించారంటూ శ్రవణ్ కూతురు(Daughter) ఆరోపిస్తున్నారు. కోర్టు వద్ద శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ కూతురు కోర్టు ముందు రోదిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ‘‘మా నాన్న ఏ తప్పు చేయలేదు. నిర్దోషి. ఆయనను ఈ కేసులో కావాలనే ఇరికించారంటూ’’ ఆమె వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమెను కుటుంబ సభ్యలు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు … కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay family) హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన అనంతరం.. కుటుంబ సభ్యులంతా ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా… వారంతా భావోద్వేగానికి గురయ్యారు.