Harish Rao
తెలంగాణ

Harish Rao : మాజీ మంత్రి హరీష్​ రావుపై కేసు నమోదు..!

Harish Rao : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్​ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ (Chakradhar) అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు మాజీ మంత్రి హరీష్​ రావుతో ప్రాణహాని ఉందంటూ చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హరీష్​ రావుతో పాటు తన ఫిర్యాదులో మరో ముగ్గురి పేర్లు కూడా చేర్చాడు చక్రధర్. దీంతో హరీష్ రావుతో పాటు రాములు, వంశీ, సంతోష్ కుమార్ ల మీద 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో హరీష్ రావును ఏ2గా పోలీసులు చేర్చారు.

ఈ కేసుపై హరీష్​ రావు ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. ప్రస్తుతం హరీష్ రావు బీఆర్ ఎస్ (bRS) చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడే చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. రీసెంట్ గానే ఆయన మీద రెండు కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులో హరీష్ రావును విచారణకు పిలిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

 

 

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు