Kishan Reddy: ఇప్పటివరకు డాక్టర్, ఇంజినీర్, పోలీస్ ఆఫీసర్ కావాలనే దేశంలోని ప్రతి ఇంట్లో కలలు కనేవారని, కానీ ప్రధాని నరేంద్రమోడీ(PM Modhi) నేతృత్వంలో ఆ ఆలోచన మారిందని, ఆస్ట్రోనాట్, స్పేస్ సైంటిస్ట్, ఏరో స్పేస్ వ్యాపారవేత్త కావాలనే కలలను కూడా సాకారం చేసుకోవచ్చనే ఆత్మ విశ్వాసం యువతలో బలపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను గురువారం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
అతిపెద్ద ప్రైవేట్ రాకెట్
స్కైరూట్ సిబ్బందికి, ముఖ్యంగా స్కై రూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన(Pawan Kumar Chandana), నాగ భరత్(Naga Bharat) కు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ ను వెలికి తీయొచ్చని వారి విజయం చాటి చెబుతోందన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ అయిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను, దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ప్రధాని మోడీ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 2040 నాటికి మరో చంద్రయాన్, 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపట్టడంతో పాటు అంతకుముందే 2027 నాటికి గగన్ యాన్ ద్వారా భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
Also Read: Mandhana Wedding: కేబీసీ ప్రత్యేక ఎపిసోడ్‌కు దూరంగా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా.. కారణం ఇదేనా?
భారతదేశం గ్లోబల్ స్పేస్..
ఇటీవల శుభాన్షు శుక్లా 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి వచ్చారని, అలాగే చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1, నిసార్, మంగళ్ యాన్ వంటి ఆపరేషన్లతో పాటు ఒకేసారి 34 దేశాలకు చెందిన 400 కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం వంటి అనేక అద్భుతమైన విజయాలను సాధించామని కొనియాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందన్నారు. 400కు పైగా ప్రైవేటు స్టార్టప్స్, 2 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు, 50 పరిశోధనా కేంద్రాలు స్పేస్ రంగానికి ఊతమిస్తున్నాయన్నారు. ఇవాళ రూ.70 వేల కోట్ల విలువైన భారత స్పేస్ ఎకానమీ.. 2033 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనావేసినట్లు చెప్పారు. ఏరో స్పేస్ తయారీ రంగంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు భారీగా ముందుకు వస్తున్నారని, 2020 నుంచి ఇప్పటి వరకు రూ.4500 కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయని కిషన్ రెడ్డి వివరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభంతో రాకెట్ల తయారీలో అయ్యే ఖర్చు భారీగా తగ్గనుందని, విక్రమ్ 1 రాకెట్ తయారీతో ఆత్మ నిర్భర భారత్ లక్ష్యానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: Shobha Shetty VS Divya: ‘చిక్కులు, దిక్కులు, లెక్కలు’ టాస్క్ విజేత ఎవరు? యోధురాలిని దివ్య ఓడించిందా?

