Mahesh Kumar Goud: బీసీల్లో ఐక్యత లోపించిందని పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్‌లో జరిగిన బీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. కేంద్రం కుల గణన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని వివరించారు. కుల గణన తో దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు.
ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే
భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలిగారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే అని గుర్తు చేశారు. చాలా వరకు బీసీలను ఓటు సాధనాలుగానే చూశారని, కానీ ఇక నుంచి వాటాలు అడిగే పరిస్థితికి వచ్చామన్నారు. సమాజంలో ఎవరి వాట వారికే సిద్ధాంతానికి కట్టుబడి పారదర్శకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందన్నారు. కుల సర్వేను వ్యతిరేకించిన కేంద్రంలోని బీజేపీ సైతం జనగణనతో పాటు కుల గణన చేపడతామని ప్రకటించిందన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కుల సర్వే పై దేశ వ్యాప్తంగా 450 పైగా కాంగ్రెస్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చామన్నారు.
Also Read: Black Box: బ్లాక్ బాక్స్ దొరికింది.. విమాన విషాదంలో కీలక పరిణామం
రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు
కామారెడ్డి డిక్లరేషన్ అనుగునంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించామన్నారు. ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వేను శాస్త్రీయ బద్ధంగా నిర్వహించారన్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్ విస్తరణతో పాటు 68 శాతం మేర పీసీసీ కార్యవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు చోటు కల్పించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుతో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కల్పించగలదని నిరూపించుకున్నదన్నారు. బీసీ బిల్లుకు చట్ట రూపం కల్పించి రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు బీసీలందరు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కులాలకు అతీతంగా బీసీ బిల్లు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.
Also Read: KTR on CM Revanth: లై డిటెక్టర్ టెస్టుకు రెడీ.. సీఎం రేవంత్ కూడా సిద్ధమా.. కేటీఆర్ సవాల్