Telangana
తెలంగాణ

Telangana: పంచాయతీ రాజ్ @ 49వేల కోట్లు

  • ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు
  • ఆపరేషన్ మెయింటెనెన్స్ పథకాలకు రూ.8,963 కోట్లు
  • గ్రీడ్‌కు రూ.5,876 కోట్లు
  • హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీకి రూ.896 కోట్లు
  • మిషన్ భగీరథకు రూ.979కోట్లు
  • రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు రూ.1,504 కోట్లు
  • టీడీడబ్ల్యూ ఎస్సీఎల్‌కు రూ.4,048 కోట్లు
  • జీతాలకు రూ.319 కోట్లు
  • బడ్జెట్‌లో ప్రభుత్వ కేటాయింపులపై ఆసక్తి

Telangana: పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. అంచనాలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. గతేడాది కంటే వెయ్యికోట్లు అదనంగా బడ్జెట్ పెట్టినట్లు తెలిసింది. ఇందులో ఆపరేషన్ మెయింటెనెన్స్ పథకాలకే అత్యధికంగా రూ.8,963కోట్లు అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలకు రూ.319 కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రభుత్వం ఎన్నికోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తుందనేది ఆసక్తి నెలకొన్నది. రాష్ట్రంలోని అన్ని శాఖలకంటే పంచాయతీరాజ్ శాఖ కీలకమైంది. పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఇందులో రోడ్లు, పేవ్‌మెంట్లు, వంతెనలు, డ్రైనేజీ వ్యవస్థలు, పార్కులు, పైపుల నీటి నిర్వహణ, నిర్మాణం, నీటి సరఫరా, వీధిలైట్ల కోసం గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్‌లను బదిలీ చేస్తుంది. ఇందు కోసం పంచాయతీ రాజ్ శాఖ 2025-26 బడ్జెట్ రూపకల్పన చేసింది. రూ.49వేలకోట్ల 44 లక్షలతో బడ్జెట్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆపరేషన్, పథకాల మెయింటెనెన్స్‌కు రూ.8,963.63కోట్లు కావాలని నివేదికలో పొందుపర్చారు. ఇందులో వేతనాలు, మరమ్మతులు, గ్రీడ్‌కు రూ.1,841.7కోట్లు, విద్యుత్ వినియోగచార్జీలు రూ.5,876.95కోట్లు, హెచ్ఎంబ్య్లూఎస్ఎస్బీకి చెల్లించాల్సిన నీటి వినియోగచార్జీలు రూ.986.59కోట్లు, మురుగునీరు శుద్ధికి చెల్లించాల్సిన చార్జీలు రూ.198.81కోట్లు, నియామకం, రవాణా కోసం రూ.9.47కోట్లు, వేసవిలో అమలు చేయాల్సిన పనుల పునరుద్ధరణకు రూ.50.7కోట్లు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక కింద పథకాలకు రూ.1,504.36కోట్లు, నాబార్డు-ఆర్ఐడీఎఫ్‌కు రూ.124.36కోట్లు, మిషన్ భగీరథ పథకానికి రూ.979.07కోట్లు, లోన్లు-టీడీడబ్య్లూఎస్సీఎల్ చెల్లింపులకు రూ.4,048.29కోట్లు, వేతనాలు-నాన్ జీతాల కోసం రూ.319.26కోట్లు బడ్జెట్‌లో అంచనాలు రూపొందించారు.

ఎంపీపీ, జిల్లా పరిషత్ భవనాలకు పెరిగిన అంచనాలు

పంచాయతీ రాజ్ శాఖ ఈ బడ్జెట్‌లో నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. 2024-25లో రూ.11.08కోట్లు బడ్జెట్ పెడితే 2025-26 సంవత్సరానికి రూ.728కోట్లు కేటాయించాలని బడ్జెట్‌లో పొందుపర్చారు. వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మతులకు అంచనాలు పెంచారు. గతేడాది రూ.200కోట్లు ప్రపోజల్స్ పంపగా ప్రస్తుతం రూ.500కోట్లకు పంపారు. మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులకు బీమా కోసం గతేడాది రూ.55.41కోట్లు కాగా ఈ బడ్జెట్‌లో రూ.68.75కోట్లు కావాలని ప్రభుత్వానికి అందజేసిన బడ్జెట్‌లో కోరారు. ఈ సారి పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ప్రత్యేకంగా రూ.3.25కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించిన బడ్జెట్‌లో అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ఆశలు

ప్రభుత్వానికి పంచాయతీరాజ శాఖ రూ.49వేలకోట్ల బడ్జెట్‌ను అందజేసింది. గతేడాది కంటే వెయ్యికోట్లు అదనంగా కావాలని, ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పొందుపర్చి ప్రకటన చేయాలని కోరింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే అధికారులు బడ్జెట్‌ను రూపొందించారు. అయితే కోరిన బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటిస్తారనే ఆశతో ఉన్నారు. అయితే గత బడ్జెట్‌లో కూడా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసినా తక్కువగా కేటాయించింది. అలా కాకుండా ఈ బడ్జెట్‌పై మాత్రం ఆశలు పెట్టుకున్నారు.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం