Padi Kaushik Reddy: అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దు.. కౌశిక్ రెడ్డి.
Padi Kaushik Reddy (imagecredit:twitter)
Telangana News

Padi Kaushik Reddy: అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దు.. కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట అబించింది. అతడిని సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయొవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దర్యాప్తు కొనసాగించొకోవచ్చని, పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి ఆదేశింది. క్వారీ యజమాని మనోజ్‌ను 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని కౌశిక్‌ పై కేసు నమోదు చేసిన మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది అన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నాయని కౌశిక్ రెడ్డి న్యాయవాది అన్నారు. మలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ 2023 అక్టోబర్‌25న 25 లక్షల రూపాయలు కౌశిక్‌ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని పీపీని హైకోర్టు  ప్రశ్నించింది.

Also Read: 11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 24 గంటల్లో 11 మంది మృతి!

అయితే అతని బెదిరించడంతో 25 లక్షలను కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించాడన్న పీపీ ఇప్పుడు 50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పీపీ పేర్కోన్నారు. అయితే ఈ విషయంపై 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని హైకోర్టు ప్రశ్నించింది. కౌశిక్‌ రెడ్డిని తదుపరి విచారణ కోనసాగే వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలిస్తూ ఈనెల 28వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!