Ippapuvvu Laddu: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా గా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట పొందిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారుచేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంది.
అధిక ప్రయోజనాలు
ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ క్రియ మెరుగుపడడం రోగ నిరోధక శక్తిని పెంచడం గుండె కొలెస్ట్రాల్ తగ్గించడం అధిక శక్తిని పొందడం బరువు నియంత్రణ తో పాటు డయాబెటిస్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు పూర్వకాలంలో ఆదివాసి గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు ముందుగా ఉపయోగించేవారు అని ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపియడం ద్వారా పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు.
గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు
గర్భిణీ స్త్రీలు ఇప్పప్పు లడ్డు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పోషకాలు గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుందని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు.
Also Read: Hindu youth burned: బంగ్లాదేశ్లో మరో ఘోరం.. హిందూ యువకుడి సజీవ దహనం.. ఎలా చంపేశారంటే?
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది దానిలో భాగంగానే ఇప్పపువ్వు లడ్డు తయారీ ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటుచేసి వీరికి రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఉట్నూర్ ఐటిడిఏ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పపువ్వు లడ్డు తయారీ, క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించారు*.
కొండపర్తి గ్రామంలో..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. ఈసం మంగవేణి, ఇర్ప మంజుల , ఇర్ప మౌనిక,ఈసం సాంబలక్ష్మి, ఈసం వరలక్ష్మి వీరి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసి ఎంఎస్ఎమ్ఈ లో రిజిస్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కన్నేపల్లి గ్రామం నుంచి చెరుప నాగమణి, గొండి అనురాధ, గొండి మాణిక్యం, గొండి స్వరూప వీరి ఆధ్వర్యంలో సార్ వాళ్ళ అమ్మ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఫుడ్ లైసెన్స్ పొందడం జరిగింది. మేడారం వచ్చే భక్తులకు జాతర పరిసరాలలో పది స్టాల్స్ ఏర్పాటు చేశామని ఒక బాక్స్ లో 250 గ్రాములతో 150 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఇప్పపువ్వు లడ్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని లడ్డు రుచి కూడా అమోఘంగా ఉందని గర్భిణీ స్త్రీలు ఎంతగానో ఉపయోగిస్తున్నారని కొనుగోలుదారులు చెప్తున్నారు.
Also Read; Eco Tourism: సోమశిల సౌందర్యం తెలంగాణ పర్యాటకానికి మణిహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు

