Nominated Posts
తెలంగాణ

Nominated Posts : పదవుల జాతర

= సీఎం హింట్‌తో మొదలైన కసరత్తు
= కాంగ్రెస్‌లో ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు?
– డీసీసీలకు పీసీసీ సర్క్యూలర్
= సిన్సియర్‌గా ఉన్నోళ్లకు ఛాన్స్
= పార్టీ విధానం కూడా అదేనన్న మీనాక్షి నటరాజన్
= జిల్లాల నుంచి లిస్టు వచ్చిన తర్వాత వడపోత
= నామినేటెడ్ పోస్టులతో కేడర్ కాన్ఫిడెన్స్

Nominated Posts : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాంగ్రెస్ (Congress) పార్టీలో పదవుల ప్రాసెస్ మొదలైంది. సీఎం హింట్‌తో పీసీసీ కసరత్తు మొదలు పెట్టింది. ఎవరు ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతం కోసం చేసిన కృషి ఏమిటీ? వంటి వివరాలను పీసీసీ (Pcc) సేకరిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పీసీసీ ఆదేశాలిచ్చారు. సిన్సియర్‌గా పార్టీ కోసం పనిచేసినోళ్ల పేర్లను వెంటనే పంపించాలని డీసీసీలను కోరారు. జిల్లాల నుంచి లిస్టు‌లు రాగానే పీసీసీ ఫిల్టర్ చేయనున్నది. ఈ నెల 10 వ తేదీ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం (Cm) హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ స్పీడ్‌గా జాబితాను తయారు చేస్తున్నది. రాష్ట్ర పార్టీకి వచ్చిన ప్రపోజల్స్ నుంచి సీఎం, పీసీసీ చీఫ్‌లు పేర్లను ఫిల్టర్ చేయనున్నారు. ఆ తర్వాత ఆ జాబితాలను ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు పంపనున్నారు. ఆమె అప్రూవల్ తర్వాత ఏఐసీసీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి కమ్యూనికేషన్ రాగానే ఫైనల్ జాబితాను ప్రకటించనున్నారు. పనిచేసి నోళ్లకు కచ్చితంగా పదవులు లభిస్తాయని ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌చార్జ్ నొక్కి చెప్పారు. దీంతో ఈ సారి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందనేది? ఇప్పుడు పార్టీలో ఉత్కంఠగా మారింది.

వాళ్ల నుంచి కూడా సిఫారసులు?

పార్టీ, ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర కీలక లీడర్లు సైతం తమ రిక్వెస్ట్‌లు పరిగణలోకి తీసుకోవాలని పీసీసీని కోరుతున్నారు. కొంద‌రైతే తమ ఫాలోవర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. మరి కొందరు పక్క రాష్ట్రాల్లోని కీలక నేతలు, ఢిల్లీ స్థాయిలోని ఏఐసీసీ నేతల‌తోనూ సిఫారసు చేయించుకుంటున్నారు. అయితే ప్రస్తుత ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ రిక్వెస్ట్‌లను ఎలా తీసుకుంటారనే‌ది? ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిఫారసులు, పైరవీలకు ఆమె ఛాన్స్ ఇవ్వరంటూ ఏఐసీసీ నేతలు ఇప్పటికే లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్‌లోనూ ఆమె స్పీచ్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఒక్క రోజు వ్యవధిలోనే కొందరు లీడర్లు పదవుల కోసం పైరవీలు చేయడం మొదలు పెట్టడం గమనార్హం.

కార్పొరేషన్‌తో పాటు జిల్లా స్థాయిలోనూ…

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల కార్పొరేషన్లతో పాటు జిల్లా లెవెల్‌లో పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ నామినేటెడ్ పదవులూ నింపనున్నారు. ప్రభుత్వం, పార్టీలోని కార్పొరేషన్లతో పాటు గ్రంథాలయ కమిటీ, కో ఆప్షన్ సభ్యులు, కో ఆపరేటివ్, సహకార సంస్థలు, రైతు కమిటీలు ఇలా తదితర నామినేటెడ్ పదవుల్లో నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తున్నది. ఇందుకు అనుగుణంగా పేర్ల ఎంపికపై కసరత్తు మొదలైంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పార్టీ ఫ్రంటల్ విభాగాలకు చైర్మన్లుగా పనిచేసినోళ్లనే ప్రభుత్వంలోని కార్పొరేషన్లకు ప్రెసిడెంట్లుగా నియమించారు. ఆ తర్వాత ఆయా సీట్లలో ఖాళీలు ఏర్పడినా..భర్తీ వైపు పార్టీ ఫోకస్ పెట్టలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు‌గా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంబ్బైకి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటిలో కొన్ని క్యాబినేట్‌తో కూడిన చైర్మన్లు ఉండగా, మరి కొన్నింటికీ లేవు. కీలక నేతలంతా క్యాబినేట్‌తో కూడిన చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతుండగా, ఏ చైర్మన్ ఇచ్చినా తమకు పర్వాలేదని మరి కొంత మంది నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

రేసులో ఈ కేటగిరీలు? ఇది సాధ్యమేనా?

పార్టీ కోసం మొదట్నుంచి పనిచేసి నోళ్లతో పాటు ఎన్నికల ముందు పార్టీ విజయం కోసం కృషి చేసినోళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. దీంతో పాటు గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి, చివరి నిమిషంలో టిక్కెట్లు కోల్పోయినోళ్లూ కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీభవన్‌లోని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, స్పోక్స్ పర్సన్స్, పార్టీ వివిధ విభాగాల చైర్మన్లు, టిక్కెట్ రాని నేతలు, సీఎం, క్యాబినేట్ మంత్రుల సన్నిహితులు ఇలా దాదాపు మూడు వందల మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యకరం. అయితే కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి మంత్రి వర్గ కూర్పు వరకు కుల, సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదే విధానంలో ఎమ్మెల్సీ ఎంపికతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను సెలక్ట్ చేస్తామని సీఎంకు అతి సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు.

వీటికి పుల్ డిమాండ్?

హెచ్ఎండీఏ , ఇరిగేషన్​ డెవలప్‌మెంట్​కార్పొరేషన్​, కాకతీయ అర్బన్​డెవలప్‌మెంట్​అథారిటీ, వక్ఫ్‌బోర్డు, బెవరేజెస్​డెవలప్‌మెంట్​కార్పొరేషన్​, రోడ్స్​డెవలప్‌మెంట్​కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ర్టీస్​డెవలప్‌మెంట్​కార్పొరేషన్​లిమిటెడ్​, రైతు‌బంధు సమితి, మార్క్​ఫెడ్​, కో ఆపరేటివ్​సొసైటీ యూనియన్‌, వేర్​హౌసింగ్​‌కార్పొరేషన్​, ఫిషరీస్​‌కో ఆపరేటివ్​‌సొసైటీస్​ఫెడరేషన్‌, డెయిరీ డెవలప్‌మెంట్​‌కో ఆపరేటివ్​‌ఫెడరేషన్‌, షీప్​అండ్​‌గోట్ డెవలప్‌మెంట్​‌కో ఆపరేటివ్​ఫెడరేషన్‌, సివిల్​‌సప్లైస్​‌కార్పొరేషన్‌, స్టేట్​కౌన్సిల్​‌ఆఫ్​‌హయ్యర్​‌ఎడ్యుకేషన్​, మీడియా అకాడమీ, పవర్​లూమ్​, టెక్స్‌టైల్​ డెవలప్‌మెంట్​‌కార్పొరేషన్​, ట్రేడ్​ ప్రమోషన్​ ‌వంటి కార్పొరేషన్లకు మిగతా వాటి కంటే ఎక్కువ పోటీ ఉన్నదని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పార్టీ ఇప్పటికే 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వగా, మరో 54 కార్పొరేషన్లకు దాదాపు 200 మంది కీలక నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?