Niranjan reddy (imagecredit:twitter)
తెలంగాణ

Niranjan reddy: పాలన చేతకాక ప్రభుత్వం సాకులు చెబుతుంది: నిరంజన్ రెడ్డి

Niranjan reddy: దేశంలో ప్రజలు అత్యంత సొంతం చేసుకున్న నినాదం జై జవాన్ -జై కిసాన్ ఆ నినాదాన్ని ఇచ్చిన పార్టీ యే రాష్ట్ర లో ఇపుడు అధికారంలో ఉంది. అదే కాంగ్రెస్(Congress) పార్టీ నై కిసాన్ నై యూరియా అంటోందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. తెలంగాణ భవణ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా(Urea) కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాల పాలు జేస్తోంది. యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి సరిపడా యూరియ ఇచ్చామంటుంటే రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటోందని అన్నారు. మధ్యలో యూరియా ఎక్కడ బోయినట్టు ? రోడ్ల మీదకు రైతులు ఎందుకు వస్తున్నట్టు ? ఓ రైతు బర్త్ డే చేసుకుంటే యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చారు.

అలాంటి పరిస్థితి రాష్ట్ర లో ఉండటం దురదృష్టకరమని అన్నారు. గతంలో ఉల్లిపాయల కొరత ఉన్నపుడు పుట్టిన రోజులకు ఉల్లి గడ్డలు కానుకగా ఇచ్చి నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఉల్లిపాయల కొరతతో ప్రభుత్వాలే పడిపోయాయి యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలి. వరి 45 లక్షలు, పత్తి 46 లక్షలు 18 లక్షలు, ఉద్యాన వన పంటలు మరో 9 లక్షల ఎకరాల్లో సాగు అయ్యాయని అన్నారు.

మంత్రులు ఏం చేస్తున్నట్టు?
గతం కన్నా 22 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిందని, మిగతా పంటల విస్తీర్ణం కూడా తగ్గిందని అన్నారు. కేసీఆర్(KCR) హయంలో 2022 లో కోటి 35 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండేది. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియా అపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగామని తెలిపారు. ఇపుడు సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ సారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9 లక్షల 80 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు. ఇందులో ఐదు లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారు. ప్రభుత్వం దగ్గర మార్క్ ఫెడ్ గోడౌన్లలో సరిపడా స్టాక్స్ లేవు. ప్రతి రోజూ రైతులకు 15 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని అన్నారు.

Also Read: Telangana Rains: బీ కేర్ ఫుల్ అప్రమత్తంగా ఉండండి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు?

ఇపుడు 5 వేల టన్నులు కూడా యూరియా సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు. ఏప్రిల్ లోనే రాష్ట్రాలకు కేంద్రం యూరియా కేటాయింపులు చేస్తుంది. కాంగ్రెస్(Congress) బీజేపీ(BJP) ఎంపీ లు మంత్రులు ఏం చేస్తున్నట్టు? సీఎం రేవంత్(CM Revanth Reddy) యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు యూరియా బ్లాక్ మార్కెట్ అవుతుందనే నీమ్ కోటెడ్ చేశారని అన్నారు. ఇపుడు బ్లాక్ మార్కెట్‌కు తరలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కేవలం కుంటి సాకులు చెబుతోందని నిరంజన్ రెడ్డి అన్నారు. సాఫీగా పాలన సాగుతున్న రోజులు పోయి ప్రజలను కష్టపెట్టే పాలన వచ్చిందని అన్నారు.

ఇంగ్లీష్ అవసరం లేదు
కేసీఆర్(KCR) హాయంలో రైతులకు సకాలంలో అన్నీ వచ్చాయి. ఇపుడెందుకు రావడం లేదు? ప్రతి దానికి కేసీఆర్ నే విమర్శించడం సీఎం(CM) కు మంత్రులకు అలవాటుగా మారిందని అన్నారు. చేత గాకనే విమర్శలు చేస్తున్నారు పంటల బీమా పథకం తెస్తామని తేలేదు రైతు బీమా కు ప్రీమియం కట్టలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దయ్యబట్టారు. రైతు బంధును కూడా రెండు సార్లు ఎగ్గొట్టారు. ఇంగ్లీష్ భాష రావడం, రాకపోవడం గురించి సీఎం ను ఎవరు అడిగారు. రాహుల్ గాంధి(Rahul Gandhi) యేమో ఇంగ్లీష్ అత్యవసరం అని అంటారు. రేవంత్ రెడ్(Revanth Reddy)డి యేమో ఇంగ్లీష్ అవసరం లేదు కామన్ సెన్స్ ఉండాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి కి కామన్ సెన్స్ ఉంటె రైతుల యూరియా కష్టాలు తీర్చేవారు కాంగ్రెస్ బీజేపీల మధ్య సంబంధాలు బాగున్నపుడు యూరియా కొరత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీ లు ఎపుడూ యూరియా కొరత గురించి మాట్లాడటం లేదు మంత్రి తుమ్మల బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు .ఇద్దరు కలిసి నిజమేమిటో చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది జాతీయ సంపద. దాన్ని వాడుకోవడం ప్రభుత్వ కనీస భాద్యత బనక చర్ల కోసం కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని అన్నారు. రైతు బీమా దరఖాస్తు కోసం మూడు రోజుల టైమ్ పెట్టడం లబ్దిదారుల సంఖ్య తగ్గించడానికి కాదా? యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం పై ప్రభుత్వం ఇప్పటికైనా ద్రుష్టి పెట్టాలి
..రైతులకు యూరియా అందించకపోతే బీ ఆర్ ఎస్ ప్రభుత్వ మెడలు వంచి యూరియా అందేలా ఒత్తిడి పెంచుతుందని అన్నారు.

Also Read: Tollywood Actor: బరితెగించిన హీరో.. డైరెక్టర్ చెప్పాడని.. రోడ్డుపై ప్యాంట్ తీసేసి..!

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?