Lift Irrigation Project: పర్యావరణ అనుమతులు వచ్చాకే నారాయణపేట-కొడంగల్ లిప్టు ఇరిగేషన్ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(National Green Tribunal) సూచించింది. లిప్టు ఇరిగేషన్ కు చెందిన పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్రం విధివిధానాలను ఖరారు చేసింది. హైదరాబాద్(Hyderabad) లోని జల సౌధాలో ఈ నెల 23న ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థలతో పర్యావరణంపై పడే ప్రభావంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (SEIAA) సమావేశం నిర్వహించారు.
9 లొకేషన్లలో భూగర్భ జలాలు
ఆ సమావేశంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్(Mukthal), నారాయణపేట(Narayanapeta), కొడంగల్నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకుపైగా నీళ్లిచ్చేందుకు చేపట్టిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టుపైనా చర్చించారు. ప్రాజెక్టు టీఓఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. ఆ ప్రాజెక్టుతో పర్యావరణం మీద పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు పలు ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఎస్ఈఐఏఏ(SEIAA) సభ్యులు సమావేశంలో సూచించారు. ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్న ప్రాంతంలో 9 లొకేషన్లలో భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, మట్టి నమూనాలు సేకరించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2,434 చెట్లను కొట్టేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారని, ఒక్క చెట్టును కొట్టేస్తే దానికి రీప్లేస్మెంట్గా ఐదు చెట్లను నాటాలని ఎస్ఈఐఏఏ సభ్యులు సూచించారు.
Also Read; Khammam District: నోట్లో గుడ్డలు కుక్కి.. భర్తను చితక్కొట్టిన భార్య.. దెయ్యమే కారణమా?
పర్యావరణ ప్రభావ అంచనా
ప్రాజెక్ట్ను కర్ణాటకకు సరిహద్దుల్లో నిర్మిస్తుండటంతో ఆ రాష్ట్ర ఎన్వోసీని తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కర్ణాటక(Karnataka) ఎన్వోసీ ఇచ్చిందని తెలంగాణ అధికారులు సంబంధిత ఎన్వోసీని అందజేశారు. ప్రాజెక్టు బీ1 కేటగిరీలో ఉన్నందున వెంటనే పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. నేల పరిస్థితులు, భౌగోళిక, రసాయనిక పరిస్థితులను విశ్లేషించాల్సిన అవసరం ఉందని సూచించారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పనులను పర్యావరణ అనుమతులు వచ్చే వరకు చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(National Green Tribunal) అధికారులను ఆదేశించింది. పనులను తాత్కాలికంగా ఆపేయాలని గుత్తేదారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం భూసేకరణ దశలోనే ఉన్నది.
Also Read: H-CITI Project: హెచ్ సిటీ పనులు స్పీడప్.. సర్కారుకు ఏజెన్సీల జాబితా!