Mlc Kavitha: తెలంగాణ జాగృతి బలోపేతంపై దృష్టిసారించింది. జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్వీనర్లను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించింది.
తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గా మరిపెల్లి మాధవిని నియమించారు. తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గా ఎదురుగట్ల సంపత్ గౌడ్, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా అప్పాల నరేందర్ యాదవ్, తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గా జానపాటి రాము యాదవ్, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్ గా పరకాల మనోజ్ గౌడ్ ను నియమించారు.
Also read: Vijay Sethupathi: విజయ్ సేతుపతి ‘ఏస్’ తెలుగు రైట్స్ ఎవరికంటే..
తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా వీరికి బాధ్యులు అప్పగించామని కవిత పేర్కొన్నారు. ఆయా విభాగాల బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. వీరి నియమకాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆమె ప్రకటించారు.