MLC Dasoju Sravan: ఇది నిజాం రాజ్యమా ?నియంత రాజ్యమా ? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ లో స్పీకర్ సమక్షం లో ఫిరాయింపుల పై విచారణ జరుగుతోందన్నారు. విచారణ నేపథ్యం లో నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి ఓ బులెటిన్ విడుదల అయిందన్నారు. సందర్శకులకు, మీడియా పై ఆ బులెటిన్ ద్వారా అసెంబ్లీ లోకి ప్రవేశాన్ని నిషేధించారని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి పార్టీల సభాపక్ష కార్యాయాల వరకే అనుమతి ఉంటుందని బులెటిన్ లో పేర్కొన్నారన్నారు.
బులిటిన్ హుకుం జారీ
ఈ కేసులో వాదిస్తున్న అడ్వకేట్లను సెల్ ఫోన్ లు తీసుకు రావద్దని బులిటిన్ హుకుం జారీ చేసిందన్నారు. ఈ బులెటిన్ రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. ఏం గూడుపుఠాణీ నడపాలని ఈ బులెటిన్ ద్వారా నిషేధాజ్ఞలు విధించారు ? అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు(Supreme Court) ఫుల్ బెంచ్ వాదనలు జరిగినపుడు కూడా సెల్ ఫోన్లు అనుమతిస్తారు.. ఇది స్పీకర్ సొంత వ్యవహారం కాదు ,రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు అన్నారు. తక్షణమే బులెటిన్ ఎత్తి వేయాలని స్పీకర్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
Also Read: Chennai Love Story: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ పోస్టర్.. స్పెషల్ ఏంటంటే?
లైవ్ స్ట్రీమింగ్ ద్వారా..
ఈ విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశమివ్వాలని కోరారు. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైడ్రా(Hydraa) పేరిట ఆర్ ఆర్ టాక్స్(RR Tax) పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. జూబ్లి హిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని మండిపడ్డారు. పోలీసులు బోగస్ ఓటింగ్ కు సహకరించారన్నారు. ఎంఐఎం(MIM) కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ సహకరించిందన్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుందన్నారు. సమావేశంలో నేతలు సతీష్ రెడ్డి(Satish Reddy) ,హరి రమా దేవి ,కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Also Read: Delhi blast Dubai link: ఢిల్లీ పేలుడు కేసులో మరో షాకింగ్.. దుబాయ్‌లో అనుమానితులు!
