Minister Vivek: గత బీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.మెదక్ జిల్లా దుబ్బాక నియోజక వర్గం చేగుంట లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు . కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణతో పనిచేసి గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అన్నాచెల్లెళ్ల గొడవ తో పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందని అన్నారు. కమిషన్లతో బీరస్పాటి నేతలు కాలం వచ్చారని అన్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్లు కుటుంబ అభివృద్ధి కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయలేదని విమర్శించారు. బిజెపి పార్టీ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం వందే యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు. 9,000 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు ప్రతి ఒక్క ఆరుగులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ సాయం లో 400 ఉన్న గ్యాస్ లీలాలు 900 కు తీసుకపోయిన ఘనత బిజెపి పార్టీదని, విమర్శించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులతో పాటు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.