Minister Vakiti Srihari: స్థలం కోసం రంగంలోకి దిగిన మంత్రి
Minister Vakiti Srihari inspecting land for 220 KV sub station in Makthal
Telangana News, లేటెస్ట్ న్యూస్

Minister Vakiti Srihari: సబ్‌స్టేషన్‌ నిర్మాణ స్థలం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి

Minister Vakiti Srihari: 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

మఖ్తల్ జనవరి 21 (స్వేచ్ఛ): నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.70 కోట్లతో 220 కేవీ సబ్ స్టేషన్ ఎర్పాటు కానుంది. సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) బుధవారం పరిశీలించారు. మఖ్తల్ పట్టణం హైవేకు ఆనుకుని ఉండటం, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికీ 150 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కోర్టు లాంటివి పట్టణంలో అందుబాటు వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని కీలక కార్యాలయాలు సైతం మఖ్తల్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా కరెంట్ కష్టాలు ఉండకూడదనే ముందు చూపుతో సబ్‌స్టేషన్ నిర్మించబోతున్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ కోసం ఏకంగా 70 కోట్ల రూపాయల నిధులను మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కేటాయించిందని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఇంజనీర్ నాగశివ, ఇతర అధికారులతో పాటు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Read Also- Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Just In

01

Sangareddy District: చెల్లిని ప్రేమించాడని.. ప్రియుడ్ని అడవిలోకి తీసుకెళ్లి.. అన్నలు దారుణం!

Honey Teaser: నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. సైకలాజికల్ హారర్ చెమటలు పట్టిస్తుంది

IND vs NZ 1st T20I: భారత్ vs కివీస్.. కొద్ది గంటల్లో తొలి టీ-20 మ్యాచ్.. ఎవరు గెలుస్తారు?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ పెద్దలందరి పాత్ర.. టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణ

Minister Vakiti Srihari: సబ్‌స్టేషన్‌ నిర్మాణ స్థలం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి