తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: minister thummala Nageshwar Rao: గ్రామగ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య , రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి , అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే నూతన కార్యక్రమాన్ని జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత కొన్నేళ్ళ నుంచి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొందిన విత్తనాలను రైతాంగానికి అందించటం ద్వారా రైతులను నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించవచ్చన్నారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన విత్తనాన్ని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాలలోని ప్రతి గ్రామం నుంచి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేస్తామన్నారు.
Also Read: Former MLA Shakeel Aamir: అజ్ఞాతంలో బీఆర్ఎస్ ముఖ్య నేత.. పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు
ఈ పథకంలో సుమారుగా 2500-3000 క్వింటాళ్ళ ఐదు ప్రధాన పంటలైన వరి, కంది, పెసర, మినుము, జొన్న విత్తనాన్ని దాదాపు 40,000 మంది రైతులకు అందజేస్తామని వెల్లడించారు.ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు తిరిగి ఆయా పంటలలో పండిన విత్తన పంటను ఆయా గ్రామాలలో తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందజేయటం ద్వారా వచ్చే మూడేళ్లలో గ్రామంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంటుందన్నారు.
దీని ఫలితంగా రైతాంగం నకిలీ విత్తనాల మోసాల బారి నుంచి రక్షించబడటమే కాకుండా నాణ్యమైన విత్తనం ద్వారా 10-15% దిగుబడి అదనంగా దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో పాటు రైతు నికరాదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విత్తన సంచాలకుడు నగేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/