Telangana Tourism: ములుగు జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క పేర్కొన్నారు. గురువారం వెంకటాపూర్ మండలం పాలంపేట లోని హరిత కాటేజ్ లో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపు శిక్షణలో భాగంగా గత తొమ్మిది రోజులుగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తెలంగాణ టూరిజం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న శిక్షణ శిబిరాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. కాకతీయ రాజుల చరిత్ర గురించి నిర్వహిస్తున్న కార్యక్రమానికి రాష్ట్రం, విదేశాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడారు. తన జీవితంలో ఏ విధంగా ఈ స్థితికి వచ్చానో ఇక్కడున్న ప్రాంత ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ రామప్ప మంచి అనుభూతిని ఇస్తుందన్నారు.
ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక మీ ప్రాంతాల్లో కాకతీయ రాజుల గురించి వివరించాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ పాండురంగరావు మాట్లాడుతూ.. వరుసగా నాలుగోసారి రామప్ప ప్రాంతంలో వరల్డ్ హెరిటేజ్ క్యాంపును నిర్వహించడం సంతోషంగా. ప్రతి ఏడాది వివిధ ప్రదేశాల నుండి వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు కాకతీయ రాజుల కళా సంపద వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలా అనే అంశం మీద వాటి ప్రాముఖ్యతను వివరించారు. అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి, మేడారానికి ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నారో.. అదేవిధంగా టూరిజం కూడా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్, మండల నాయకులు పాల్గొన్నారు.
