Minister Seethakka: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు అన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను తక్షణం సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, పోషకార మిషన్, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియమకాలు, అంగన్‌వాడీ(Anganwadi) సేవల్లో మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం, చిన్నారుల పోషకాహార మెరుగుదల కోసం అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.
చిన్నారుల్లో పోషకాహరాన్ని మెరుగు పరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Seethakka) మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నూతన అంగన్‌వాడీ (Anganwadi) భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా అంగన్‌వాడీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ అంగన్‌వాడీ, (Anganwadi) కంటేనర్ మొబైల్ అంగన్‌వాడీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: Anganwadi: సొంత భవనాలేని అంగన్‌వాడీలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం!
వీటికి సంబంధించి వెంటనే నిపుణులతో చర్చించి డిజైన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ (Anganwadi) చిన్నారుల్లో పోషకాహర లోపాన్ని తగ్గించే విధంగా కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. చిన్నారుల్లో పోషకాహర మెరుగుదల పరిశీలించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పారదోలేందుకు, వారికి అందించే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వంద రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు కేసు నేపథ్యంలో అంగన్‌వాడీల్లో (Anganwadi) ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అద్దె బస్సులతో మహిళా సంఘాలకు రూ. కోటి
అర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కోటి అర్జించాయని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. 150 బస్సులను అర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించగా ఒక్కో బస్సుకు ఆర్టీసీ (RTC) నెలకు రూ.70 వేలు చెల్లిస్తున్నదన్నారు. మొదటి నెల పేమెంట్‌ను ఆర్టీసీ మహిళా సంఘాలకు చెల్లించిందని, దీనికి సంబంధించిన చెక్కును ఆర్టీసీ (RTC) యాజమాన్యం నుంచి సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో భేటీ అయిన దివ్యా దేవరాజన్, సెర్ప్ సిబ్బంది మంత్రి సీతక్కకు మిఠాయిలు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీతక్క ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 5న ప్రజా భవన్‌లో జరిగే ఆర్టీసీ (RTC) బస్సు ఓనర్లుగా ఉన్న మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు
అంగన్‌వాడీ (Anganwadi)హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్‌వాడీ (Anganwadi) టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మంత్రి సీతక్క (Seethakka) సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్ళీ అవకాశం లభించనున్నది. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్‌వాడీ (Anganwadi) హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవలే అంగన్‌వాడీ (Anganwadi) టీచర్ల రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో, 50 ఏళ్ల వయస్సులో టీచర్‌గా పదోన్నతి పొందే హెల్పర్లు, ఇంకా15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. 45 ఏళ్ల వయస్సు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం (Seethakka) చేశారు. దీంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?