మెదక్ బ్యూరోస్వేచ్ఛ: Minister Ponnam prabhakar: దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో నే పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని 18 వ వార్డులో గల చౌక ధరల దుకాణం వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రేషన్ కార్డులు ఉన్న మహిళలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ….
రాష్ట్ర మొత్తం17263 చౌక ధరల దుకాణాలలో 2 లక్షల 91 వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది రోజున ప్రారంభించామని చెప్పారు. రేషన్ షాప్ లలో సన్న బియ్యం పంపిణీ అనే ప్రక్రియ ఒక చారిత్రాత్మకమైనది. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక బృహత్ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో రాష్ట్రంలో అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
నిరుపేద ప్రజలు ఆరోగ్యంగాంచడం కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా నిరుపేదలు సైతం,సన్నబియ్యం తింటూ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సూచించారు. మా ప్రభుత్వం మహిళా సంఘాలకు సంబంధించి కోటిమంది మహిళలను కోటీశ్వరు లను చేయడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నాం. గ్యాస్ సంబంధించి 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నామన్నారు. ఆర్టిసి బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం అందజేస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏదైతే చెప్పాము ప్రతిదీ చెప్పింది చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ అమీద్. జిల్లా డీ ఎస్ ఓ తనూజ, డీ సీ ఎస్ డీ ఎం ప్రవీణ్, అర్ డి ఓ రామ్మూర్తి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి. మార్కెట్ కమిటీ చైర్మన్ కంది, తిరుపతిరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: TG on BC reservation: తెలంగాణ తరహా చట్టం? ఉత్తరాది రాష్ట్రాలలో తీవ్రమైన చర్చ..