Ponnam Travel in TGSRTC: పంజాగుట్ట నుండి లక్డికపూల్‌లో హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రయానించారు. ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ప్రతిరోజు ఉద్యోగాలు చేసే మహిళలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు మంత్రి పోన్నంకి తెలిపారు.
ఉచిత ప్రయాణం వల్ల తమకు నెల వారిగా డబ్బులు ఆదా అవుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని మహిళా ప్రయాణికులు అన్నారు. కొత్తగా నగరంలో పెద్ద మొత్తంలో ఆర్టీసీ బస్సులు వచ్చాయని ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read: : AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. పెద్ద తలకాయల అరెస్ట్
ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయనీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు వారికి, ప్రత్యేక పథకాలు అందిస్తున్నామని మంత్రి పోన్నం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలుకూడా పరిష్కారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.