Minister Jupally Krishna rao{( image credit: twitter)
తెలంగాణ

Minister Jupally Krishna rao: కాశ్మీర్‌లో చిక్కుకున్న.. తెలంగాణ పర్యాటకుల రక్షణకు చర్యలు.. మంత్రి జూపల్లి!

Minister Jupally Krishna rao: కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన వారిని సుర‌క్షితంగా స్వ‌స్థ‌లాల‌కు ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ర్యాట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామ‌ని పేర్కొన్నారు.

ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల జమ్ము, కాశ్మీర్ లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరారు. పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

 Also Read: NVSS Prabhakar: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ నేత పహల్ గావ్ దాడిని గుర్తు చేస్తూ హెచ్చరిక!

తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఆద్వ‌ర్యంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామ‌ని, కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యాట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు. 9440816071, 9010659333, 040 23450368, టూరిజం కంప్లాయింట్ నుంబర్ 7032395333, టోల్ ఫ్రీ నెంబర్ : 180042546464

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..