Munnuru Kapu leaders : తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కులగణనపై బీసీ నేతలు మీటింగ్ పెట్టి బల ప్రదర్శన చేశారు. ఇప్పుడు తాజాగా కాపు నేతలు అంతా ఒక్కటి అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ (Congress) నేత వీ హనుమంత రావు ఇంట్లో అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు సమావేశం అయ్యారు. కులగణనలో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ వారు ఈ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ తో పాటు బీఆర్ ఎస్, బీజేపీ, బీఎస్పీ లీడర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే కాపుల బల ప్రదర్శన కోసం ఇందులో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో వీహెచ్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కే కేశవరావు లాంటి కీలక నేతలు కూడా ఉన్నారు. కులగణనలో కాపుల సంఖ్య తగ్గించారంటూ ఇందులో వారు చెప్పారు. కాపు నేతలను మంత్రి వర్గంలోకి తీసుకోలేదని కూడా తెలిపారు. త్వరలోనే ఈ అంశాలను బేరీజు వేసుకుని ఓ భారీ సభ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.