Medak District: రామాయంపేట పట్టణంలో జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా టీయూడబ్ల్యూజే – ఐజేయూ (TUWJ IJU) ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం.. స్థానిక శ్రీకర ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ టియుడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఉపాధ్యక్షులు పాతూరు రమేష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి మర్కు నగేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే – ఐజేయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి, రాష్ట్ర గ్రామీణ విలేకరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బుక్క అశోక్, మిన్పూర్ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. వీరి సమక్షంలో రామాయంపేట టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read- Maoist Links: రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సామాజిక మార్పుకు దారితీసే శక్తిగా
అధ్యక్షుడిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి బైరవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, సహాయ కార్యదర్శులుగా రామారాపు యాదగిరి, కూస్తి నారాయణ.. ముఖ్య సలహాదారులుగా చంద్రపు అమరేందర్ రెడ్డి, పాతూరి రమేష్ గౌడ్, మర్కు నగేష్.. కార్యవర్గ సభ్యులుగా తుజాల శ్రీనివాస్ గౌడ్, బోయిని రాజు, కమ్మరి వెంకటరాములు, మేకల శివాజీ, రాచపల్లి సురేష్, సిహెచ్. సుమన్, బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులు సామాజిక మార్పుకు దారితీసే శక్తిగా రానున్న రోజుల్లో పత్రికారంగ అభివృద్ధి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం దిశగా కృషిచేస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. రామాయంపేటలో ఏర్పడిన ఈ కొత్త బృందం ఐజేయూ విలువలను ముందుకు తీసుకెళ్లాలని, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఏకతాభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా జర్నలిజం వద్దు
పాత్రికేయులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి సమస్యలను వెలికి తీస్తే పాత్రికేయునికి గుర్తింపు దానంతట అదే వస్తుందని జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేటి సమాజంలో సోషల్ మీడియా జర్నలిజం (Social Media Journalism) పెరిగిందని, సోషల్ మీడియా జర్నలిజం ద్వారా ప్రజలకు, నాయకులకు మధ్య పాత్రికేయుల సంబంధాలు తగ్గుతాయని.. పాత్రికేయుడు జనం మధ్యలోకి వెళ్లి సమస్యపై స్పందించి.. వార్తా కథనం రాస్తే సమాజానికి మేలు చేసిన వారు అవుతారని.. ఆ దిశగా జర్నలిస్టులు ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. కావున ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు సోషల్ మీడియా జర్నలిజం బారిన పడకుండా ఉండాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
