Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్
Ganja seize (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Shamshabad Airport: షాకింగ్.. శంషాబాద్ ఎయిర్​ పోర్టులో భారీగా గంజాయి సీజ్

Shamshabad Airport: గంజాయి విలువ రూ.14 కోట్ల పైగానే ఉంటుందని అంచనా

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ​శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో (Shamshabad Airport) భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్​ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖతార్​ దేశం నుంచి శుక్రవారం నాడు ఖతార్ ఎయిర్​‌లైన్స్‌కు చెందిన విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో, ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న లగేజీలను తనిఖీ చేయగా14 కిలోల హైడ్రోఫోనిక్​ గంజాయి ప్యాక్​ చేసి ఉన్న 14 పొట్లాలు దొరికాయి. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 14 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులిద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also- CM Revanth Reddy: సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో.. సీఎం కీలక వ్యాఖ్యలు..!

వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం

విశ్వసనీయ సమాచారం మేరకు శేరిలింగంపల్లి జోన్​ ఎస్‌వోటీ అధికారులు ఓ గంజాయి విక్రేతను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. నానక్​ రాంగూడలో నివాసముంటున్న నీతూ సింగ్‌కు ‘గంజాయి డాన్’​ అన్న పేరున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెను అరెస్ట్​ చేసిన పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు. అప్పటి నుంచి నీతూ సింగ్​ అల్లుడు కన్నయ్య సింగ్​ గంజాయి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో దాడి చేసిన ఎస్‌వోటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని గంజాయి సీజ్​ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కాగా, గచ్చిబౌలి ఎన్టీఆర్​ నగర్‌లో గంజాయి అమ్ముతున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన దేబూ బాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్న దేబూ గంజాయి కూడా డెలివరీ చేస్తున్నట్టుగా విచారణలో తేలింది. అతడి నుంచి 35 వేల రూపాయల విలువ చేసే 670 గ్రాముల గంజాయిని సీజ్​ చేశారు.

Read Also- Ambani-Adani: వామ్మో.. ఒకే రోజు అంబానీ, అదానీలకు చెరో రూ.22 వేల కోట్లకుపైగా నష్టం.. ఎందుకంటే?

ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్.. ఎండీఎంఏ స్వాధీనం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పక్కా సమాచారంతో హైదరాబాద్ యాంటీ నార్కొటిక్ ఎన్​ ఫోర్స్​ మెంట్ వింగ్​ (హెచ్​ న్యూ) అధికారులు… టోలీచౌకీ పోలీసులతో కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్​ దందా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 20 లక్షల విలువ చేసే 15‌‌0 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ న్యూ డీసీపీ వైభవ్​ గైక్వాడ్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన చిడి ఎజెహ్​ ఎలియాస్​ నాగేశ్వరన్ (42) పదహారేళ్ల క్రితం మెడికల్ అటెండెంట్​ వీసాపై భారత్​ వచ్చాడు. న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఇక్కడికి వచ్చాక రెండు నెలలకే పాస్​ పోర్ట్​, వీసా కాలపరిమితి ముగిసినా స్వదేశానికి వెళ్లలేదు. నాగేశ్వరన్​ పేరిట నకిలీ ఆధార్ కార్డు, పాన్​ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి ఇక్కడే అక్రమంగా ఉంటున్నాడు. నైజీరియా దేశానికే చెందిన క్రిస్ అనే వ్యక్తి నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తక్కువ ధరలకు కొని ఎక్కవ ధరలకు హైదరాబాద్​, బెంగళూరు, న్యూ ఢిల్లీలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు.

Just In

01

GHMC Commissioner: గ్రేటర్‌ను పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చాలి.. రంగంలోకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్!

TG Health Department: ఆరోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు? బడ్జెట్ ప్రపోజల్ సిద్ధం చేస్తున్న అధికారులు!

YouTuber Arrest: మైనర్లతో అసభ్య ఇంటర్వ్యూలు.. ఏపీ యూట్యూబర్ అరెస్టు

Khamenei – Trump: ‘ట్రంప్.. నీ పతనం ఖాయం’.. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్

GHMC: ఆ తేది నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనకు ఛాన్స్.. ఆ తరువాతే మూడు కార్పొరేషన్ల ఉత్తర్వులు?