TG GlobalSummit: వంద ఎకరాల్లో అతిథులకు భారీ ఏర్పాట్లు
–గ్రీనరీతో స్వాగత తోరణాలు, రహదారులు
–వెయ్యి మంది కూలీలతో 32 విభాగాల్లో పనులు ముమ్మరం
–మూడెంచల వ్యవస్థతో పోలీసుల బందోబస్తు
–ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు
రంగరెడ్డి బ్యూరో స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం 2047 లక్ష్యంతో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం చూడుతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించే భారత్ ప్యూచర్ సిటీ పరిసరాల్లో సమ్మిట్కు ముమ్మరంగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసమ్మిట్ కు హాజరయ్యై అతిథులకు ఏలాంటి లోటు లేకుంఆ ఏర్పాట్లు చేసేందుకు ఓ సంస్థకు టెండర్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న సంస్థ వెయ్యి మంది కూలీలతో 32 విభగాల్లో చేపట్టిన పనులు తుదిదశకు వచ్చాయి. సుమారుగా 100 ఎకరాల భూమిలో సమ్మిట్ నిర్వహించేందుకు చదును చేసి విదేశీల నుంచి వచ్చే ప్రతినిథులు అబ్బురపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చే ప్రతినిధుల రాకపోకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుతుంది. అదేవిధంగా నేరుగా హెలిక్యాప్టర్ ద్వారా వేదిక పరిసరాలకు వచ్చేందుకు మూడు హెలీపాడ్లు, ఇక్కడి నుంచి వేదిక వద్దకు వచ్చేందుకు ఆరు బస్సులు అందుబాటులో ఉంచనున్నారు.
పూర్తిగా వృత్తాకారంలో..
రహదారులకు ఇరువైపుల గ్రీనరీతో కనిపించే విధంగా ఎత్తైన పూల మొక్కలను నాటారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే వేదిక వృత్తకార డీజైన్లో ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్ ప్రారంభ వేదికలో 2,500 మంది కూర్చునేలా సీట్లు పోందుపర్చానున్నారు. వేదికకు ఇరువైపులా మరో ఆరు హాల్స్ సిద్ధం చేస్తున్నారు. ఇవి పూర్తిగా వృత్తాకారంలోనే ఉండనున్నాయి. ఎగ్జిబిషన్, ఇష్టాగోష్టి, పరస్పర ఒప్పందాలు వీటి కిందే జరగనున్నాయి. వివిధ విభాగాలకు చెందిన 45 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన స్టాళ్లు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ కేంద్రంగానే పెట్టుబడుదారులను ఆకర్షించనున్నాయి. ఇప్పటికే కంపెనీలు పెట్టేందుకు అగ్రీమెంట్లు చేసుకున్న ప్రతినిధులతో పాటు కొత్తగా మరికొన్ని కంపెనీ ప్రతినిధులతో ఓప్పందాలు జరగనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. అయితే దాదాపు 2600 మంది వీదేశి కంపెనీ పెట్టుబడుదారులు 1300 కంపెనీల నుంచి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gummadi Narsaiah Biopic: ప్రారంభమైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్.. మంత్రి ఏం అన్నారంటే?
ప్రాధాన్యత క్రమంలో ఏర్పాట్లు..
విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడిక్కడ రహదారి ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌ఫోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు హెలీక్యాప్టర్లు బస్సులు వెధిక వరకు సిద్దం చేశారు. అదేవిధంగా హైదరాబాద్(Hyderabad) నగరంతో పాటు శంషాబాద్ పరిసరా ప్రాంతాల్లోని హోటల్లో ఉండే విదేశీ ప్రతినిధులు పరిసర ప్రాంతాలను ఆకర్షించేలా బస్సు ప్రయాణానికి ఏర్పాటు చేశారు. సమ్మిట్కు హాజరై ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పాసు జారీ చేయనుంది. రెండు రోజుల పాటు 8,9 తేదీలలో పూర్తి బందోబస్తు మధ్య గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఫోర్త్ సిటీ ప్రాంతంలో ఉండే ప్రతినిధులకు టెక్నికల్ కమ్యూనికేషన్ అందుబాటులో ఉండేలా టీ ఫైబర్, గిగా బైట్స్ ఫర్ సెకండ్ వెగంతో నెట్ వర్కును ఏర్పాటు చేశారు. అన్ని రంగాల నెట్వర్క్ సంస్థలు టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి.అతిథుల వాహనా పార్కింగ్‌కు ఆరు స్థలాలను సదస్సు సమీపనాకి సీఎం, మంత్రుల కాన్వాయ్‌లు వెళ్లేందుకు రహదారులు. స్ధానికంగా నిర్వహించే ఏర్పాట్లో పారిశుద్ద్య, తాగునీట సరపఱా వంటి వాటిని తుక్కుగూడ మున్సిపాలిటీ అధికారులకు అప్పగించారు.టీ, టీఫీన్, స్నాక్స్, భోజన, విశ్రాంతి తీసుకునేందుకు వేదికకు ఇరువైపుల ఏర్పాటు చేసి రూమ్‌లను ఉపయోగించుకోనున్నారు. వచ్చే అతిథుల హోదా, స్ధాయిని బట్టి హాల్స్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం రల్ మోడల్గా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే అతిథులకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు చకచక ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుంచి వరసగా రెండు రోజులు జరిగే సమ్మిట్కు ఏర్పాట్లు తుద దశకు చేరాయి. మరోకసారి ఆదివారం ఏర్పాట్లును అధికారులకు ఇచ్చిన ప్రణాళికను పిన్ టు పిన్ పరిశీలించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వేదిక స్థలం వద్దకు చేరుకొని అధికారులకు ఏర్పాట్లపై సలహాలు, సూచనలు చేశారు. వీరితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పోంగులేటీ శ్రీనివాస్ రెడ్డిలు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు దశల వారీగా పరిశీలించడం జరిగింది. శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పోంగులెటీ హాజరై పనులను పరిశీలించారు.
Also Read: Bigg Boss 9 Telugu: భరణీని చిక్కుల్లో పడేసిన తనూజ.. డీమాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాడా?..

