Mahesh Kumar Goud: అక్టోబరులో డీసీసీ నియామకాలు పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumra Goud) వెల్లడించారు. సమర్ధమైన వ్యక్తులకే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కు వివరించానని తెలిపారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించినట్లు తెలిపారు.
అక్టోబర్ 15 వ తేదీ కల్లా..
క్షేత్ర స్థాయిలోప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారన్నారు. సంస్థాగత పునర్నిర్మాణం పకడ్బందీగా, ఏ గ్రూపు ఓత్తిడి కి లొంగకుండా పనిచేయాలన్నారు .అక్టోబర్ 4 వ తేదీ నుంచి ఏఐసిసి పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. అక్టోబర్ 15 వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు,డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు సమర్పిస్తారన్నారు. ఇక ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ తప్పు చేశారన్నారు. కేటీఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారన్నారు.
Also Read; UP Madrassa: యూపీలో ఘోరం.. 40 మంది బాలికలను.. బాత్రూమ్‌లో బంధించి..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..
మూసీ సుందరీకరణ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishna Reddy) అడ్డుకుంటున్నారన్నారు. గుజరాత్లో సబర్మతి నది డెవలప్ చేసుకున్నట్టు తెలంగాణలో మూసీని సుందరి కరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అభివృధి విషయంలో రాజకీయాలు ఉండొద్దన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నిక(Local body elections)ల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. బీసీ(BC)లకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిందన్నారు. అగ్రవర్ణమైన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy), మంత్రి వర్గం బీసీ రిజర్వేషన్లు అమలు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు.
Also Read: Madharaasi OTT: హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?