shivaratri-crowd
తెలంగాణ

Mahashivaratri: మహా శివరాత్రి… భక్తులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

Mahashivaratri: మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మొగుతున్నాయి. ముఖ్యంగా వేములవాడ, కీసర, శ్రీశైలం, శ్రీకాళహస్తీ తదితర క్షేత్రాలకు విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ  సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇక, పలు ఆలయాల్లో నాయకులు పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న శ్రీ మృత్యుంజయ మహా దేవాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ శివాలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక పూజలు చేశారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ