Love Marriage Incident : ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే, పారిపోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి చేసిన సంఘటన నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుకుందాం..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయిన మణిరాజ్ గత నెల 24న ఆరేపల్లి కి చెందిన నిషితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి వివాహం చేసుకుని, షాయబ్పేట పోలీసులను ఈ జంట ఆశ్రయించింది. అయితే, వీరిద్దరూ మేజర్లు కావడంతో రెండు కుటుంబాలకు చెందిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Also Read: RCB Banned from IPL: ప్రాణాలు కంటే సంబురాలే ముఖ్యమా? ఆర్సీబీని బ్యాన్ చేయాలంటున్న నెటిజన్స్
మణిరాజ్ తన భార్యతో కలిసి తన చిన్నమ్మ అయినా సముద్రాల స్వాతి, బాలరాజు ఇంటికి నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి వెళ్ళారు. బుధవారం నిషిత బంధువులు శనిగరం ఊరుకు వెళ్ళి మణిరాజ్, నిషితను వారితో పంపించాలని దాడికి దిగారు. దీంతో, పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న వీరిపై బంధువులు మళ్లీ దాడి చేశారు. అమ్మాయిని లాక్కొని తీసుకెళ్తుండగా అడ్డుకోవడంతో గొడవ పడి, కొట్టుకునే వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో కూడా రెండు కుటుంబాల వారు దాడులు చేసుకోవడంతో ఇది సంచలనంగా మారింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!