revanth ( Image Source: Twitter )
తెలంగాణ

Telangana: బీసీ రిజర్వేషన్ల పేటెంట్ రైట్ .. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే

Telangana: తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ రైట్ కమ్యూనిస్టులది, విప్లవ ఉద్యమాలకు పేటెంట్ రైట్ నక్సలైట్లది, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ పేటెంట్ రైట్ కెసిఆర్ ది అన్నట్టుగా రిజర్వేషన్ల పేటెంట్ రైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కోసం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ పైసా ఇచ్చింది లేదు ప్రాజెక్టు తెచ్చింది లేదన్నారు. అసలు బిజెపికి ఏర్పాటు ఇష్టం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ వనరులను కొల్లగొట్టిందని భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయని కెసిఆర్, హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో దోషులుగా నిలుస్తారు అన్నారు. కేటీఆర్ కారు రేస్ కేసులో, కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారని కడియం ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని పంట రుణాలు, రైతు భరోసా, ఎస్సీ రిజర్వేషన్ అమలు, మహాలక్ష్మి పథకం, ఉచిత సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు మొదలైన పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. ఎఐసిసి పరిశీలకులు పట్నాయక్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, పీసీసీ పరిశీలకులు ఎండి అవేజ్, శ్రీకాంత్, అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

 

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?