Republic Day 2026: మందు బాబులూ .. రేపు వైన్స్ బంద్
Liquor shops remain closed across India on Republic Day as part of dry day regulations
Telangana News, ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Republic Day 2026: మందు బాబులూ తెలుసు కదా!.. రేపు వైన్స్ బంద్

Republic Day 2026: మరికొన్ని గంటల్లో యావత్ దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడబోతోంది. జాతీయ పర్వదినం గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day 2026) సంబురంగా జరగబోతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, మందు బాబులకు అలర్ట్ ఏంటంటే, రేపు (సోమవారం) వైన్స్ షాపులు (Wine Shops Close) తెరచి ఉండవు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా వైన్స్ మూతపడనున్నాయి. తిరిగి మంగళవారమే తెరచుకుంటారు. ఈ మేరకు ఇప్పటికే వైన్ షాపుల ముందు బోర్డులు కనిపిస్తున్నాయి.

మద్యంపై నిషేధం ఎందుకు, ఎప్పటినుంచి?

మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి జాతీయ పర్వదినాల్లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. అంటే, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిననాటి నుంచే ఈ విధానం విధానం మొదలైంది. రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్ 47 ప్రకారం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మత్తు పానీయాలను నియంత్రణ ఒక లక్ష్యంగా ఉంది. దీనికి అనుగుణంగా జాతీయ పర్వదినాల్లో మద్యాన్ని విక్రయించకపోవడం ఒక నైతిక బాధ్యతగా ఆచరణలోకి వచ్చింది. అందుకే, దీనిని ‘డ్రై డే’గా ప్రకటిస్తారు. వైన్స్ షాపులు మూసివేయడం వెనుక ప్రధానంగా నైతిక, సామాజిక, గౌరవప్రదమైన కారణాలు ఉన్నాయి.

Read Also- Nagarkurnool Tragedy: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోరం.. సెల్ఫీ దిగబోయి కుంటలో పడి ముగ్గురు దుర్మరణం

జాతీయ పండుగకు గౌరవం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిననాటి నుంచి గణతంత్ర దినోత్సవం అత్యంత పవిత్రమైన రోజు. స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమాధికారాన్ని పండుగగా జరుపుకునే ఈ ప్రత్యేక దినాన మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండి, దేశం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ప్రధాన లక్ష్యమని రాజ్యాంగ రూపకర్తలు సూచించారు. అలాగే, శాంతిభద్రతల పరిరక్షణ కోణంలో కూడా జాతీయ పండుగ రోజుల్లో మద్యంపై ఆంక్షలు కొనసాగుతాయి. గణతంత్ర దినోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో అనేక వేడుకలు, సభలు నిర్వహిస్తుంటారు. కాబట్టి, ఎవరూ మద్యం తాగి అల్లర్లు సృష్టించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్తగా మద్యం అమ్మకాలను ఆపివేస్తుంది.

మరోవైపు, గాంధేయవాదానికి గుర్తింపుగా కూడా మద్యం, మాంసంపై ఆంక్షలు ఉంటాయని రాజ్యాంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. మహాత్మా గాంధీ మద్యపానాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. మద్యానికి చోటు ఉండకూడదని భావించేవారు. అందుకే గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి రోజుల్లో మద్యం విక్రయాలను జరపరు. కేవలం మద్యం షాపుల్లో మాత్రమే కాదు, బార్లు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరా చేయడానికి అనుమతి ఉండదు. నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు కూడా ఉంటాయి.

Read Also- KTR: బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?