Messi In Hyderabad: క్రికెట్‌ను ఒక మతంలా అభిమానించే ఇండియాలో తనపట్ల ప్రదర్శన అభిమానాన్ని చూసి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఫిదా అయ్యాడు. ముఖ్యంగా, శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ క్రేజ్ చూసి (Messi In Hyderabad) ముగ్దుడయ్యాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడాడు. తన చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి తరలివచ్చిన అభిమానులకు మెస్సీ ధన్యవాదాలు తెలిపారు.
మీ ప్రేమకు కృతజ్ఞుడిని
భారత్‌కు రావడానికి ముందు చాలా చూశానని, గత ప్రపంచ కప్ సమయంలో చాలా విషయాలు (ఫ్యాన్స్ క్రేజ్ ఉద్దేశించి) చూశానని, ఇంత ప్రేమ చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని మెస్సీ అన్నాడు. ‘‘ భారతదేశంలో మూడు రోజులు మీతో కలిసి పంచుకోవడం మాకు ఒక గౌరవం. అందుకు, నేను నిజంగా కృతజ్ఞుడిని. చాలా చాలా ధన్యవాదాలు!’’ అని మెస్సీ పేర్కొన్నారు.
Read Also- KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!
ఇండియాలో మెస్సీ.. తొలి రోజు పూర్తి
కోల్‌కతాలో గందరగోళంతో మొదలైన మెస్సీ పర్యటన తొలి రోజు ముగిసింది. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడకపోవడంతో కోల్‌కతాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. దీంతో, మెస్సీ ఇండియా టూర్ ఉంటుందా, లేదా అనే పెద్ద అనుమానం ఏర్పడింది. అభిమానుల నిరసన కారణంగా మెస్సీ కేవలం 22 నిమిషాల్లోనే కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియాన్ని వీడాడు. మైదానం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అభిమానులు స్టేడియంలోకి వస్తువులు విసరడం, మైదానంలోకి దిగి రచ్చరచ్చ చేయడంతో అనూహ్య పరిణామాలు చవిచూడాల్సి ఉంది.
Read Also- Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!
కోల్‌కతాలో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన ఎలా జరుగుతుందనే దానిపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తెలంగాణకు విచ్చేసిన సూపర్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆశ్చర్యపోయేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్రెండ్లీ మ్యాచ్, మెస్సీని అభిమానులు పలకరించే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి భారత్‌లో మూడు రోజుల మెస్సీ పర్యటనలో తొలి రోజు ముగిసింది. ఈ రాత్రికి హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ఫ్యాలెస్‌లో గడిపి రేపు (ఆదివారం) ముంబైకి వెళ్లనున్నాడు. ముంబైలో భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో పాటు పలువురు హైప్రొఫైల్ స్పోర్ట్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలను కలవనున్నాడు.
What a Movement this is 🥹😍❤️
LEO MESSI PLAYING FOOTBALL WITH TELANGANA CM REVANTH REDDY AT THE UPPAL. 😍 pic.twitter.com/X6DTaSqp19
— @vinay_09 (@vinay_00009) December 13, 2025

