Deeksha Divas: దీక్షా దివస్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Deeksha Divas: సచివాలయంలో మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠిస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Deeksha Divas: బీఆర్ఎస్ పార్టీ (BRS) కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’‌లో శనివారం ‘దీక్షా దివస్’ (Deeksha Divas) కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదని వ్యాఖ్యానించారు. కొందరు మూర్ఖులకు మాత్రం కేసీఆర్ కనిపించడం లేదని మండిపడ్డారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్ అప్పుడే వస్తారని అన్నారు. ఎదురుదాడి ఏవిధంగా చెయ్యాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని విశ్వాసం వ్యక్తం చేశారు.  సచివాలయంలో మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠిస్తామని శపథం చేశారు. కేసీఆర్‌ చేపట్టిన దీక్ష వల్లే డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చిందని, దీక్షా దివస్‌ను ఆత్మగౌరవ పండుగగా జరుపుకోవాలని కేటీఆర్ అన్నారు.

Read Also- Uday Kiran: ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ‘మనసంతా నువ్వే’ దర్శకుడు.. ఉంటే అలా చేసేవాడిని..

రేవంత్‌పై పరోక్ష విమర్శలు!

‘‘నాయకుడిని నాయకుడే అంటారు. అర్భకుడిని అర్భకుడే అంటారు. నేను ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు. కానీ నేను ఇలానే మాట్లాడుతా. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ పరోక్ష చేసినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివారు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ ‘జై తెలంగాణ’ అనని వాళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విలన్ పాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. సోనియా గాంధీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపిన సంస్కారి కేసీఆర్ అని, కానీ, అదే సోనియాను బలిదేవత అని వ్యాఖ్యానించింది ఇప్పుడున్న సీఎం అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ సందర్బంగా కేటీఆర్ సవాల్ విసిరారు.

Read Also- Telangana Cabinet: సీఎం రేవంత్ సంచలనం.. ఆ ఐదుగురు మంత్రుల తొలగింపు.. కొత్తవారికి ఛాన్స్..!

కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా, 2009 నవంబర్ 29న నాటి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్‌లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో కీలకంగా భావించే ఈ ఘట్టాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఏడాది ‘దీక్షా దివస్‌’గా నిర్వహించుకుంటున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?