KTR (imagecredit:swetcha)
తెలంగాణ, హైదరాబాద్

KTR: బోరబండ యువకులకు ‘డాక్టర్ గార్డ్’ కంపెనీ ఏర్పాటు: కేటీఆర్

KTR: యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు అడిగే వారుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఉండాలి’ అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తితో బోరబండకు చెందిన యువకులు ‘డాక్టర్ గార్డ్’ పేరుతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని బుధవారం సందర్శించారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఒక సంవత్సరంలోగానే ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకపోయే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు వివరించారు. తమ వాటర్‌ప్రూఫ్ సొల్యూషన్స్‌లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను, టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగాలు అడగడం కాకుండా, పది మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. యువకుల ప్రయత్నంపై సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని కేటీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్‌ప్రూఫ్ పనులను వారికి అప్పగించారు. ఎలాంటి నిరుత్సాహం లేకుండా తమ ఆలోచనపై గొప్ప స్ఫూర్తితో ముందుకు పోతున్నారని ప్రశంసించారు.

మిత్ర బృందంతో కలిసి..

ఎలాంటి ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకున్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్ పెయింట్స్ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తిని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ‘డాక్టర్ గార్డ్’ భవిష్యత్తులో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మిత్ర బృందం ప్రయత్నాన్ని చూసి మరింత మంది యువత ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: Quetta Blast: పాకిస్థాన్‌లో శక్తివంతమైన కారుబాంబు పేలుడు.. 13 మంది దుర్మరణం

ప్రభుత్వంపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతులేని అరాచకత్వం, అపరిమితమైన అజ్ఞానం రాజ్యమేలుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సర్కారు కాదిది సర్కసే అని ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నారు. నిధులు ఇవ్వడం లేదంటూ పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాకెక్కుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో వరదలు వస్తే ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రపంచ బ్యాంకుకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తరం రాశారన్నారు. పరిశ్రమనే తగలబెడతానని బెదిరించి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నాడని మండిపడ్డారు.

Also Read: Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత

Just In

01

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి సాంగ్.. సోనాక్షి సిన్హా అరిపించేసిందిగా!

Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం