Konda Surekha: సాంకేతికత ఉపయోగించుకోని దేవాలయాల్లో సేవలను పారదర్శకంగా అందజేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.
సుమారు రెండు గంటలపై సుధీర్ఘంగా చర్చించారు. దేవాదాయ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. పలు కీలక అంశాలపై మంత్రి సమగ్ర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Nalgonda Murder Case: డిటెక్టివ్ స్టైల్ హత్య.. మామ-కూతురి ప్లాన్‌కు పోలీసులు చెక్!
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములు న్యాయ సంబంధిత వివాదాల్లో ఉన్న వాటి వివరాలు అందజేయాలన్నారు. ఇప్పటివరకు ఎన్నికేసుల్లో భూములను వెనక్కి తీసుకున్నాం.. ఇంకా ఎంత భూమి ఆక్రమణలో ఉంది… కేసుల పురోగతి వివరాల నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల్లో ఉన్నవాటికి పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలని సూచించారు.
ఇందుకు సంబంధించిన అంశంపై మరో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోని సేవలను డిజిటలైజ్ చేసేందుకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమయ పాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఆలయాల ఈఓల పనితీరు, సిబ్బంది తదితర వివరాలపైనా ఆరా తీశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కృష్ణవేణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు