kcr-party-meet
తెలంగాణ

KCR: లోక్ సభలో బీఆర్ఎస్ కు మెంబర్ లేడు… స్టేటుకు బర్కత్ లేదు

లోక్‌సభలో మనోళ్లు లేక హక్కులకు భంగం
దేశ రాజకీయలపై అప్రమత్తంగా ఉండాలి
ఏప్రిల్ 27న వరంగల్‌లో లక్ష మందితో సభ
పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్ధులమై మరింతగా పోరాడుదాం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తే ఉద్యమిద్దామన్నారు. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. 8 గంటల పాటు రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజానికి మొదటి నుంచీ వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీనీ పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై నిత్యం అప్రమత్తతతో ఉండాలన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు ప్రాతినిథ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యం చేయాలని సూచించారు.

తెలంగాణ బీఆర్ఎస్ రక్షణ కవచం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం అన్నారు. ఈ విషయం 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు వెల్లడించారు. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కష్టాల్లో ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
ప్రజలు మనల్నే నమ్ముతున్నారు
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ అని, ఇది తెలంగాణ ప్రజల పార్టీ, ప్రజలు బీఆర్ఎస్‌ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారని అన్నారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారని, వారి రక్షణ గులాబీనే అని నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు వెల్లడించారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం, పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పర్చాలన్నారు. బీసీ జనాభాకు అనుగుణంగా సరైన న్యాయం జరగాలన్నారు. అందుకోసం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల్లోనూ 42శాతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విమర్శలకు తావివ్వకుండా పార్టీ కమిటీల్లోనూ బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా పలు అంశాలపై అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్‌తో భేటీ… కొందరికే ఆహ్వానం! 

కొంతమంది సెలక్టెడ్ నేతలకే ఫాం హౌస్‌లో జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి సైతం ఆహ్వానం అందలేదు. అంతేకాదు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి సైతం పిలుపు రాకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, చామకూర మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వీరితో పాటు సీనియర్ నేతలు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా బలమైన నేతలు అయినప్పటికీ నేతలకు ఆహ్వానం అందకపోవడంతో చర్చనీయాంశమైంది. పార్టీలో వీరే ముఖ్య నేతలా, మిగతావారు కాదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తాము కూడా ప్రస్తుత రాజకీయాలపై అభిప్రాయం వెల్లడిస్తామని, గ్రౌండ్‌లో జరిగే పరిణామాలను వివరిస్తామని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ నేతల వ్యవహారశైలీతోనే ఓటమి చవిచూసిందని, ఇప్పుడు అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆహ్వానం అందినా హాజరుకాలేదా? అనే చర్చ సైతం జరుగుతున్నది.

Just In

01

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వాక్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు

CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్