MLC Kavitha: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. ఆమె తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. కవిత దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 25 నుంచి జాగృతి ఆధ్వర్యంలో ‘జనంబాట’ కార్యక్రమాన్ని సంకల్పించానని, ఆ కార్యక్రమాన్ని స్వామికి విన్నవించుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు.
భోగ్ భండార్‌లో కవిత
స్వామి వారి దయతో నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమయ్యే ఈ యాత్రకు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు కవిత వెల్లడించారు. మరోవైపు హాథిరాం బావాజీ మఠం బార్సీ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన భోగ్ భండార్‌లో కవిత పాల్గొన్నారు. తిరుమలకు దర్శనానికి వచ్చే బంజారా బిడ్డలకు కూడా మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాధు, సంత్‌లు దేశానికి సాంస్కృతిక సంపద లాంటివారని, వారికి దక్కాల్సిన గౌరవం దక్కాల్సిందేనన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు కవిత తెలిపారు.
Also Read: Earth: భూగర్భంలో ఏం ఉన్నాయో తెలిస్తే మతి పోవాల్సిందే!
ఐటీ విభాగం నూతన కార్యవర్గం
తెలంగాణ జాగృతి ఐటీ విభాగం నూతన కార్యవర్గాన్ని కవిత ఆదివారం ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండెబోయిన శశిధర్(Gundeboina Shashidhar) తెలిపారు. నూతన కార్యవర్గంలో పశుపతినాథ్ గజవాడను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎల్.కె. అశోక్ కుమార్(LK Ashock Kumar)ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, రాజేష్ గౌడ్(Rajesh Goud)ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అదేవిధంగా సంజయ్, కుమ్మరి రమేష్, ముఖేష్ గౌడ్లను రాష్ట్ర కార్యదర్శులుగా, ఆర్. కిరణ్‌ను రాష్ట్ర ట్రెజరర్‌గా నియమించారు. మహిళా విభాగంలో పద్మను రాష్ట్ర మహిళా ప్రతినిధిగా, అన్నపూర్ణను మహిళా విభాగం కో ఆర్డినేటర్‌గా నియమించారు. పి. శక్తి స్వరూప్ సాగర్ అధికార ప్రతినిధిగా, విజయ్ రాజా జెట్టి రాష్ట్ర పీఆర్ఓగా, ఎ. రాజు సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా, డి. రవి స్టేట్ సభ్యత్వ కో ఆర్డినేటర్‌గా, బి. సురేశ్ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.
